Sirisampadalu ichheti sirigalla thalli lyrics

సిరి సంపదలిచ్చేటి || శుక్రవారమమ్మ నీకు చక్కాని దినము తల్లి లిరిక్స్

by Lakshmi Guradasi

సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి

ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి

వెంకటరమణుని పట్టపురాణి అందుకో మా పూజలందుకోవమ్మ సిరి సంపదలిచ్చేటి

శుక్రవారమమ్మ నీకు చక్కాని దినము తల్లి
నిండు ముత్తైదులంతా నిండొక్క పొద్దుతోని
కోడికూతతోనె లేచి నీ కోవెలకే చేరి
తీరైన దండలల్లి నీ మెడల నిండుగేసి
ఆరతులెన్నో ఇచ్చేరమ్మ సిరి సంపదలిచ్చేటి
సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి

వైకుంఠపురము విడిచి ఈ అవని అందు జేరి
అష్టలక్ష్మి దేవిగానూ అవతారమెత్తినావు
ధనధాన్యమ్ ఇవ్వంగా ధనలక్ష్మి నీవయ్యి
ఆ కమలము ఆసినివై అభయాలను ఇస్తుండవ్
ఇంటింటిలోన ఇలవేల్పువై సిరి సంపదలిచ్చేటి
సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి

నీ నుదుటి కుంకుమలో రవి కిరణము చూపుతూ
మా చీకటి బ్రతుకుల్లో పండు వెన్నెలవై నిలిచి
నీ కంటికి రెప్పోలే కాపాడుతు ఉన్నావు
ఏ తీరు కొలువమ్మమ్మా మా అష్టలక్ష్మి దేవి
నీ వ్రతము చేయ దీక్ష పూనినాము సిరి సంపదలిచ్చేటి
సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి

వెంకటరమణుని పట్టపురాణి అందుకో మా పూజలందుకోవమ్మ సిరి సంపదలిచ్చేటి
సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
ఈ అవనిని ఏలగ అవతరించిన దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
నీవే మాయమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి
దేవత నీవమ్మ.. మా అష్టలక్ష్మి దేవి

_________________

Read also : tella tellani puvvulu song lyrics ayyappa

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like