పల్లవి:
స్వామి తెల్లా తెల్లని పూలు.. అవి తెల్లని మల్లె పూలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
అరెరె ఎర్రా ఎర్రని పూలు.. అవి ఎర్రని మందారాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
పచ్చా పచ్చని పూలు.. అవి పొద్దు తిరుగుడు పూలు
నీ పూజకు తెస్తా స్వామి మమ్ముల సల్లంగా చూడు చాలు
అరె గుబాళించే పూలు.. అవి రంగుల గులాబీలు
నీ మెడల వేస్తే పుణ్యం మాకు కలిగితే అది చాలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రాజ్యమంతా తిరిగి ఏరుకొస్తా దండలల్లి మెడల వేస్తా
అరె తెల్లా తెల్లని పూలు.. అవి తెల్లని మల్లె పూలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
ఎర్రా ఎర్రని పూలు.. అవి ఎర్రని మందారాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
చరణం 1:
అరె మల్లి తెచ్చిన పూలు.. అవి విచ్చిన లిల్లీ పూలు
నీ పూజకు తెస్తే కలుగునంట సుఖము సౌఖ్యాలు
సన్నా సన్నని పూలు.. అవి సన్నాజాజి పూలు
నీ మెడల వేస్తే చాలు మాకే తీరును కష్టాలు
అత్తరు జల్లే పూలు.. అవి అడవి మల్లె పూలు
నీ పూజకు తెస్తే మాయమంట మాలో దుఃఖాలు
బాగా పూసిన పూలు.. అవి బొండు మల్లె పూలు
నీ మెడల వేస్తే తగ్గునంట మోయని భారాలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రాజ్యమంతా తిరిగి ఏరుకొస్తా దండలు అల్లి మెడల వేస్తా
స్వామి తెల్లా తెల్లని పూలు.. అవి తెల్లని మల్లె పూలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
ఎర్రా ఎర్రని పూలు.. అవి ఎర్రని మందారాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
చరణం 2:
ఆహా వన్నె సక్కని పూలు.. అవి విరజాజి పూలు
నీ పూజకు తెస్తా స్వామి మాపై కురవని వరాలు
నక్షత్రాల పూలు.. అవి నందీవర్ధన పూలు
నీ మెడల వేస్తా స్వామి మమ్ముల దీవించు చాలు
స్వామి సువాసనల పూలు.. అవి సిరిమల్లె పూలు
నీ మెడల వేస్తే కలుగును మాకు సిరులు సంపదలు
స్వామి తుంచి తెచ్చిన పూలు.. అవి గుత్తుల తామర పూలు
నీ పూజకు తెస్తా స్వామి మమ్ముల సల్లగ చూడు చాలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రాజ్యమంతా తిరిగి ఏరుకొస్తా దండలల్లి మెడల వేస్తా
తెల్లా తెల్లని పూలు.. అవి తెల్లని మల్లె పూలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
ఎర్రా ఎర్రని పూలు.. అవి ఎర్రని మందారాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
చరణం 3:
స్వామి ప్రేమతో తెచ్చిన పూలు.. అవి పారిజాత పూలు
అవి దండలల్లి మెడల వేస్తా తీర్చవా మా ఆశ
స్వామి సుందరమైన పూలు.. అవి సంపంగి పూలు
నీ పూజకు తెస్తాం మణికంఠా తీర్చేయ్ మా కోరికా
స్వామి చూడచక్కని పూలు.. అవి చామంతి పూలు
నీ మెడల వేస్తా నిజం చెయ్యి స్వామి మా కలలు
భలే నీటిలో తడవని పూలు.. అవి ఏటి కలువ పూలు
నీ పూజకు తెస్తా పవిత్రంగా స్వీకరించు చాలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రంగు రంగుల పూలు.. నీ కంటికి నచ్చిన పూలు
రాజ్యమంతా తిరిగి ఏరుకొస్తా దండలు అల్లి మెడల వేస్తా
స్వామి తెల్లా తెల్లని పూలు.. అవి తెల్లని మల్లె పూలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
ఎర్రా ఎర్రని పూలు.. అవి ఎర్రని మందారాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
నీ మెడల వేస్తే మల్లి మాకే వరాలై రాలు
నీ పూజకు తెస్తే స్వామి మాకు కలుగునెంతో మేలు
____________________
Read also : Navuthavu Sandamama Vole
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.