Home » అప్‌డేట్: ’35 చిన్న కథ కాదు’ మూవీ టీజర్

అప్‌డేట్: ’35 చిన్న కథ కాదు’ మూవీ టీజర్

by Shalini D
0 comment

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ఇదో, మా సిన్న కుటుంబం తొలి సూపు’ అని హీరోయిన్ నివేదా ట్వీట్ చేశారు. డైరెక్టర్ నంద కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

నివేదా థామస్, యువ న‌టుడు విశ్వ‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ తాజా చిత్రం 35- చిన్న కథ కాదు . ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ నందకిశోర్‌ దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు కీలక పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండ‌గా.. సృజన్ యరబోలు సిద్దార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇప్ప‌టికే విడుద‌ల తేదీని అనౌన్స్ చేసిన చిత్రబృందం తాజాగా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను రానా దగ్గుబాటి సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఇక ఈ ఫ‌స్ట్ లుక్ చూస్తే.. నివేదా థామస్ ఇందులో మిడిల్ క్లాస్ మ‌హిళ‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment