ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 కోసం నామినేషన్లను మంగళవారం (జులై 16) అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా నాలుగు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తెలుగులో ఉత్తమ నటుడి కేటగిరీలో నాని రెండు సినిమాలకు నామినేట్ కావడం విశేషం. అతడు దసరా, హాయ్ నాన్న సినిమాలు రెండింటికీ ఈ ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నాడు. ఈ కేటగిరీలో నానితోపాటు చిరంజీవి, బాలకృష్ణ, ప్రకాశ్ రాజ్, ఆనంద్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టిలాంటి వాళ్లు పోటీ పడుతున్నారు.
చిరంజీవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, నాని, మృణాల్ ఠాకూర్, ఇతర నటీనటులు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. అదే సమయంలో సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్ 2, కాదల్-ది కోర్, సప్త సాగరదాచే ఎల్లో-సైడ్ ఎ, బి వంటి పాపులర్ సినిమాలు కూడా నామినేషన్లు దక్కించుకున్నాయి. రుక్మిణీ వసంత్ తో కలిసి బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ట్రోఫీని ఆవిష్కరించిన మాళవిక మోహనన్..
ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్లామర్, మంచి గుర్తింపుతో కూడిన అవార్డుల నైట్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నామినేషన్ల పూర్తి జాబితాను ఇక్కడ చూడండి.
ఉత్తమ చిత్రం: బేబీ, బలగం, దసరా, హాయ్ నాన్న, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, సామజవరగమన, సలార్: పార్ట్ 1
బెస్ట్ డైరెక్టర్: అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి), కార్తీక్ దండు (విరూపాక్ష), ప్రశాంత్ నీల్ (సలార్: పార్ట్ 1), సాయి రాజేష్ (బేబీ), శౌర్యువ్ (హాయ్ నాన్న), శ్రీకాంత్ ఓదెల (దసరా), వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ నటుడు: ఆనంద్ దేవరకొండ (బేబి), బాలకృష్ణ (భగవంత్ కేసరి), చిరంజీవి (వాల్తేర్ వీరయ్య), ధనుష్ (సర్), నాని (దసరా), నాని (హాయ్ నాన్న), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి), ప్రకాష్ రాజ్ (రంగ మార్తాండ)
ఉత్తమ నటి: అనుష్క శెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి), కీర్తి సురేష్ (దసరా), సమంత (శాకుంతలం), వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తాండ), దీక్షిత్ శెట్టి (దసరా), కోట జయరామ్ (బలగం), నరేష్ (సామజవరగమన), రవితేజ (వాల్తేరు వీరయ్య), విష్ణు ఓయ్ (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (రంగ మార్తాండ), రోహిణి మొల్లెటి (రైటర్ పద్మభూషణ్), శ్యామల (విరూపాక్ష), శ్రీలీల (భగవంత్ కేసరి), శ్రీయారెడ్డి (సలార్: పార్ట్ ), స్వాతి రెడ్డి (మధు మాసం)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: బేబి (విజయ్ బుల్గానిన్), బలగం (భీమ్స్ సిసిరోలియో), దసరా (సంతోష్ నారాయణన్), హాయ్ నాన్న (హేషం అబ్దుల్ వహాబ్), ఖుషీ (హేషం అబ్దుల్ వహాబ్), వాల్తేరు వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘలిలా- బేబి), కాసర్ల శ్యామ్ (చంకీల అంగీలేసి – దసరా), కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు- బలగం), పి.రఘు ‘రేలారే రేల’ (లింగి లింగి లింగిడి- కోటబొమ్మాళి పి.ఎస్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ కులకర్ణి (సమయమా – హాయ్ నాన్న), హేషం అబ్దుల్ వహాబ్ (ఖుషీ టైటిల్ సాంగ్- ఖుషి), పి.వి.ఎన్.ఎస్. శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘలిలా- బేబి)
ఉత్తమ నేపథ్య గాయని: చిన్మయి శ్రీపాద (ఆరాధ్య- ఖుషి), చిన్మయి శ్రీపాద (ఒడియమ్మ- హాయ్ నాన్న), ఢీ (చంకీల అంగీలేసి- దసరా), మంగ్లీ (ఊరు పల్లెటూరు – బలగం), శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి- హాయ్ నాన్న), శ్వేతా మోహన్ (మాస్టారు మాస్టారు – సర్)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.