కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నా ననీ చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందుగాళ్లూ వీరులూ శురూలు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమే మౌనవ్రతాన్ని ఛెందిచలెక పోయారు. రోజులు గడిచిపోతన్నాయి, ఇక తను తన కుమారైకు వివాహం చెయ్యలేనేమోనన్న దిగులు పటుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగు తుండగా ఒక యువకుడు వచ్చాడు.
అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి, సమస్కరించి ‘మహారాజు! యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాన్నీ, నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మానవ్రతం అంటు కాలం గడుపుతున్నారు’ అన్నాడు. వెంటనే మయూరీదేవీ లేచి,’ అంతా అబద్ధం. ఇతనుఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరించింది. అతను చిరునవ్వు నవ్వి అవును, నేనువరో మీకు తెలియదు. నేను అవంతీ దేశపు యువరాజు వివేకవర్థనుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయాడానికే అబద్ధం చెప్పా నంటూ మారువేషాన్ని తొలిగించాడు.. వివేకవర్థనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమారై నిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.