నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా ఇక్కడ ఇచ్చుపుచ్చుకునే రొట్టెలు కోర్కెలు తీరుస్తాయని భక్తుల విశ్వసం. ఏటా లక్షల మంది ఈ దర్గాని దర్శించుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారం మొహరం మాసంలో కొత్త ఏడాది మొదలవుతుంది. ఈ నెలలో చంద్రవంక కనిపించించిన 11 వ రోజు నుంచి 4 రోజుల పాటు రొట్టెల పండగ జరుపుకోవడం ఆనవాయితీ. మొదట్లో ఈ పండగని 2 రోజుల పాటు జరుపుకునేవారు కానీ భక్తులు పెరగడం తో ఇప్పుడు నాలుగు రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తుంది.
ఒక నెల్లూరు జిల్లాకే పరిమితమైన ఈ పండుగ. ఇప్పుడు దేశవ్యాప్తం అయింది.పవిత్ర బారా షహీద్ దర్గా లో ఇచ్చే రొట్టెలని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. దర్గాకి వచ్చే భక్తుల కోర్కెలు తీరాలంటే రొట్టెలు పంచాలి. కోర్కెలు తీరినవాళ్లు కొత్తవారికి రొట్టెలు ఇవ్వాలి. ఇది రొట్టెల పండుగ ఆచారం. ఇలా మొదలైన రొట్టెల పండుగ ప్రస్తుతం అనేక మంది భక్తులని ఆకర్షిస్తుంది. దర్గా దేగ్గెర ఉత్సవం లో పాల్గొనటానికి ప్రస్తుతం దేశం నలుమూలలు నుంచి వస్తున్నారు.
ఒక కోర్కెకు 5 రొట్టెలు:
ఈ పండగలో వివిధ ఆచారాలు వున్నాయి. గోధుమ పిండితో తాయారు చేసిన రొట్టెలను, బెల్లం తో పాటు దర్గా లోని సమాధుల దెగర పెట్టాలి. ఆ తరువాత పక్కనే వున్న చెరువు దెగరకి వెళ్లి నీళ్లను తలపై చల్లుకుని కోర్కెలు నెరవేరాలని వేడుకుంటారు. ఆ తరువాత చుట్టూ ప్రక్కన వాళ్ళ రొట్టెలు పంచుతారు. ఒక కోర్కెకు 5 రొట్టెలు పంచాలి అనేది ఇక్కడి ఆచారం. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దానే తాయారు చేసుకుని రావాలి. అయితే దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చెరువు వద్దే రొట్టెలు చేసి అముతుంటారు. ఈ దర్గా కి వచ్చిన భక్తులు మల్లి వస్తే వేరే కొత్త భక్తుడిని వెంట తీసుకువెళలి.
పెళ్లి, విద్య, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం ఇలా ఏదికావాలన్నా దర్గా కి వచ్చి మొక్కుకుని రొట్టెలు పంచుతారు. బారా షహీద్ దర్గా కు అన్ని మతాలువళ్ళు వస్తారు.
గంధమహోత్సవం:
రొట్టెల పండుగలో ప్రత్యక ఆకర్షణ గంధమహోత్సవం, ఈ వేడుకను చూడడానికి భక్తులు తెల్లవార్లూ జాగారం చేస్తారు. మాత పేదలకు ఇచ్చే గంధం అందుకోవడానికి పోటీ పడతారు. చివరి రోజు తహలిల్ తో ముగుస్తుస్తుంది.
రొట్టెలు పండగ అసలు చరిత్రలోకి..
అర్కాబ్ నవాబ్ కాలం నుండి ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం సౌదీ అరేబియా నుంచి 12 మంది వీరులు భారత దేశానికి వచ్చారు. కర్ణక ప్రాంతం అప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు హైదర్ అలీ పాలనలో ఉండేది. అరబ్ దేశం నుంచి వచ్చిన వీరులు రాజు అనుమతితో ప్రవక్త దైవ బోధనలు చెప్పేవారు. నెల్లూరు ప్రాంతం లో మషీద్ లు కటించారు. అధేవిధం గా ముస్లింలకు మరియు ముస్లింతరులుకు బికార యుద్ధం జరిగింది. అదే సమయం లో 12 మంది అరబ్ వీరుల తలలను వజాల రాజులు నరికేశారు. గంధవరం ప్రాంతం లో వీళ్ళ తెగి పాడగా, మండేలాను మంత్రం గుర్రాలు నెల్లూరు చెరువు వద్దకు తీసుకువచ్చాయి. దీంతో వీళ్లకు ఇక్కడే సమాధి కట్టినట్టు చరిత్ర చెబుతుంది. విళ్లన్ని షహిద్ లని పిలుస్తారు. వీళ్ళు 12 మంది కాబట్టి బారా షహీద్ లని పిలుస్తారు.
బారా షహీద్ దర్గా పట్ల భక్తులకి ఇంతా విశ్వాసం పెరగడానికి కారణం 400 ఏళ్ళ క్రితం జరిగిన ఒక ఘటన కారణం అయింది. తమిళనాడు అర్కాబ్ నవాబ్ భార్య తీవ్రఅనారోగ్యం తో బాధపడుండేదంట. దీంతో ఆమె అన్ని పుణ్యశేత్రం లు తిరిగి చివరికి బారా షహిద్ దర్గా కు వచ్చిందంట. ఆ దర్గా ప్రగణం లో బస చేసారు. అంతే ఉదయం లేచేసరికి విచిత్రం జరిగింది. ఆమె వ్యాధి నయం అయింది. దీంతో అర్కాబ్ నవాబ్ సతి సమేతం చెరువులో స్నానం చేసారు. ఆమె తన ఆరోగ్యం నయం కావడం తో చెరువులో రొట్టెను వదిలారు. అంతే అప్పటి నుంచి ఈ సంప్రదాయం జరుగుతువుంది.
ప్రభుత్వ బస్సుల సౌకర్యం అందుబాటు..
ఈ ఏడాది భక్తుల కోసం బారా షహిబ్ దర్గాకు వెళ్లేందుకు ప్రభుత్వం 44 ప్రత్యక ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. ఈ బస్సులకు సాధారణ చార్జీలే తీసుకుంటామని తెలిపారు.
బారా షహీద్ దర్గా(Bara Shaheed Darga) లొకేషన్( Location):
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను చుడండి .