93
రామాపురం అనే ఊరిలో రంగడు, జగ్గు అని ఇద్దరు ఉండేవారు. వాళ్లిద్దరూ ఎప్పుడూ ఏదో విధంగా గొడవపడుతూ ఉండేవారు. ಆ ఊరి వాళ్లు తాగునీటిని పక్కనే ఉన్న వాగు నుంచి తెచ్చుకునేవారు. అక్కడికి వెళ్లాలంటే ఒక కొండపై నుంచి సన్నని దారిలో వెళ్లాలి. పక్కకి జరిగితే కింద పడిపోయేంత ప్రమాదకరంగా ఉంటుంది. ఆ మార్గం అప్పటికే నీళ్లకు వెళ్లిన రంగడు తిరుగుప్రయాణమయ్యాడు. అతడికి చూసిన జగ్గు నీటి కోసం బయలుదేరాడు. ఇద్దురూ సన్నని మార్గంలో ఎదురుపడ్డారు ఒకరిని చూసి ఒకరు పక్కకు జరగమని గొడవకు దిగారు మాటా మాటా పెరిగి కొట్లాడుకున్నారు. ఒకరినొకరు నెట్టుకోవడరితో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి ప్రాణాలు పొగొట్టుకున్నారు.
నీతి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్లాలో తెలుసుకోవాలి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.