Home » తెలివి తక్కువ కోతి

తెలివి తక్కువ కోతి

by Nithishma Vulli
0 comments
thelivi thakkuva kothi

ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపం చుట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని “ఓ మునివర్యా! నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను. ఇప్పుడు నాకు ఈ అంతిమ దశలో వాటి గురించి భయం పట్టుకున్నది. నేను చేసిన దాని మూలముగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరములవారు నరకములో ఘోర పాపములను అనుభవించెదరేమో! దీనికి తమరే సహాయం చేయాలనీ” వేడుకున్నాడు.

అతడి ప్రార్థన విన్న మునీశ్వరుడు అతడి పట్ల జాలితో “నాయనా! అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు కనుక. నీవు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అనునిత్యం పేదలకు అన్నదానం చేయించు దానితో నీ యొక్క పాపములు పరిహారమవుతాయని తెలిపాడు.

మునీశ్వరుని సలహా నచ్చిన ఆతడు ఆయనకు నమస్కారము చేసి తన ఇంటికి చేరుకుని వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఇందు నిమిత్తంగా కొద్దిగా చెక్క అవసరమైనది. దానితో కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దూలాలు తీసుకువచ్చి మండప నిర్మాణానికిగాను వాటిని రంపాలతో కోయసాగారు. దానితో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉండసాగింది.

ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడివద్ద ఉంటున్న కోతులమందలోని ఒక కోతి చూసింది. దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకు వచ్చి పోతూ ఉండేది. మిగిలిన కోతులు మనుషులతో మనకు పనేమిటంటూ దానిని హెచ్చరించాయి. అయినా అది వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివారందరూ ఎక్కడ దూలాలను అక్కడే వదిలి భోజనానికి వెళ్ళారు. వారు లేకపోవడం చూసిన కోతి అక్కడికి వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుపమేకులు కనిపించాయి. వాటిని దూలాలు సగం వరకు కోసిన తరువాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండటానికిగాను పెడతారు.

ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. ఎంతకి రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి దానితో బలవంతంగా కొట్టింది. ఆ రాయి దెబ్బకు ఆ మేకు క్రిందకు జారి పోవడం దూలం దగ్గరగా చేరడం మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిల తన్నుకుని మరణించడం జరిగింది.

మరిన్ని కథల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.