Home » జింక బద్ధకం- నీతి కథ

జింక బద్ధకం- నీతి కథ

by Manasa Kundurthi
0 comments
telugu moral stories

ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసి మెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైన దనీ, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ ఆ మాటకు ఒప్పు కునేది కాదు. ‘నేను కూడా చాలా చురుకైనదాన్ని’ అని గొప్పలు పోయేది. ఒక రోజు ఇదేమాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని… ‘సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి… దానికీ కుందేలుకూ ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్నీ బహుమతిగా పొందొచ్చు’ అని చెప్పింది. దానికి కుందేలూ, జింకా సరేనన్నాయి.

మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలుకాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. ‘అబ్బా… ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడమంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా’ అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టునూ, తుప్పనూ, బండనూ వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది! జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్నీ, చురుకుదనాన్నీ మెచ్చుకు న్నాయి. ‘అయ్యో… పక్కనే ఉన్నా బద్ధకంతో చూడక ఓడిపోయానే’ అని బాధపడి జింక అప్పటినుంచీ తన పద్ధతి మార్చుకుంది.

ఈ కథలోని నీతి ఏమిటంటే కాలయాపన చేయడం మన ఎదుగుదలకు, విజయానికి అడ్డంకిగా మారుతుందనేది కథ సారాంశం. బాధ్యతను స్వీకరించడం మరియు సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా, అడ్డంకులను అధిగమించవచ్చు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు మరియు సంతృప్తికరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని సృష్టించవచ్చు.

ఇలాంటి మరిన్ని నీతి కథలకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.