అంబికా దర్బార్ బత్తి ఫౌండర్ అంబికా కృష్ణ గారు వెస్ట్ గోదావరి జిల్లాలో జన్మించారు. ఏలూరు సెనగపప్పు బజార్ లో చిన్నపెంకుటూ ఇంట్లో పుట్టారు. వీరి కుటుంబంలో 30 మంది సభ్యులు ఉన్నారు మరియు వారు ఆంధ్ర ప్రదేశ్‌లో అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. ఈయన తండ్రి పేరు ఆలపాటి రామచంద్రరావు గారు, ఈయనకి నలుగురు కుమారులు. ఆ నలుగురిలో 2 వ వాడు అంబికా కృష్ణ గారు.
అంబికా కృష్ణ గారు 10 వ తరగతి వరకు ఏలూరు మునిపల్ స్కూల్ లో చదువుకున్నారు. చదువు అనంతరం వాళ్ళ నాన్నగారి దెగ్గర ఫస్ట్ లో ప్రొడక్షన్ మెన్ గా మరియు స్లెస్మాన్ గా పనిచేసారు.
అంబికా అగర్బక్తులకు మూలం:
అంబికా కృష్ణ గారి తాతగారు ఆయుర్వేద మందులను తాయారు చేసి అమ్మేవారు. అయన మరణించిన తరువత వాళ్ళ నాన్న గారికి ఆయుర్వేద మూలికలతో పొగ వచ్చే అగర్బక్తులు చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. ఆలా అంబికా జాబాజి బత్తి, నిర్మల హెయిర్ ఆయిల్ తయారు చేసారు. ఆ తరువాత 1946 లో ఆయుర్వేద మూలికలతో అంబికా దర్బార్ బత్తి ని తాయారు చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ నాన్న గరే “భగవంతునికీ భక్తునికీ అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి” అని కాప్షన్ పెట్టి ఆడ్ ఇచ్చారు.
అంబికా పాపులారిటీకి కారణం:
అంబికా కృష్ణ గారు ఒక సెంటిమెంట్ వ్యాను లో ప్రతి శుక్రవారం అంబికాని అమ్మడానికి వెళ్ళేవారు. అప్పట్లో మస్తానీ ధర్బార్ బత్తి ప్రసిద్ధి. అప్పుడు ప్రతి ఊరికి, ప్రతి కొట్టు కు వెళ్లి దాని విశిష్టత చెప్తూ అంబికా ఆగర్భక్తి ని ప్రజలకి అలవాటు చేసి పాపులర్ చేసారు. 60 వ సంత్సరంలో “అమ్మని మార్చిపోలేం అంబికాని మార్చిపోలేము” అనే కొత్త టైటిల్ పెట్టారు. 63 నుంచి 70 ములికల వరకు అగర్బక్తిలో వాడుతునారు. ప్రస్తుతం 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పడు అంబికా అగర్బక్తులకు మార్కెట్ ప్రైస్ 800 కోట్లు వుంటుంది.
సినీ పరిశ్రమకు ఇంట్రీ :
1975లో అంబికా కృష్ణ గారి తండ్రి, డీలక్స్ థియేటర్‌ని నిర్మించారు. అది పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి ఏసీ థియేటర్. అంబికా కృష్ణ గారికి ప్రముఖ హీరో కృష్ణ గారికి మధ్య పరిచయం ఉండేది. ఆలా సినీ పరిశ్రమపై ఆశక్తి కలిగింది. అయన మొదట, సినిమాకి డిస్ట్రిబ్యూషన్ చేశేవారు. తరువాత సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. EVV సత్యనారాయణ గారి కలిసి “కన్యాదానం” అనే చిత్రం యొక్క ప్రొడక్షన్‌లో పనిచేశాడు, అది హిట్ అయ్యి మరింత ముందుకు సాగింది. భవిష్యత్‌లో బాలయ్య బాబుతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నారు. ఆపై అంబికా కృష్ణ గారు వైజాగ్ మరియు చెన్నైలో హోటళ్లను కూడా నిర్వహించడం ప్రారంభించాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ను చుడండి.