Home » చురుకైన పనివాడు – కథ

చురుకైన పనివాడు – కథ

by Haseena SK
0 comment
26

ఒక భూస్వామి దగ్గరి వీరయ్య అనేవాడు తోటమాలిగా వుండేవాడు. వాడికి వయసు పైబడుతున్న కారణంగా క్రమంగా ఓపిక తగ్గిపోసాగింది. వాడు పని మాని ఇంటిపట్టున వుండదలచిಆ సంగతి యజమాని చెప్పాడు. భూస్వామి అందుకు సరే అని నీ స్థానంలో సోమరితనం లేకుండా కష్టించి పనిచేసే చురుకైన నవాణ్ణి చూడ అని చెప్పాడు. ఈ సంగతి తెలిసి ముగ్గురు వచ్చారు. ఆ సమయంలో వీధివాకిలి దగ్గర వీరయ్య భూస్వామితో ఏదో మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురూ వచ్చిన పని చెప్పగానే వీరయ్య వాళ్ళతో సరే మీలో ఎవరో ఒకరు వీధి వాలకిలి ఎదురుగావున్న ఈ బండరాయిని తీసి దూరంగా పారవేసిరండి అన్నాడు. పచ్చిన వాళ్ళలో ఇద్దురు ఆ రాయి కేసి చూసి ఇంత పెద్ద రాయిని కదిలించాలంటే ఎంత శ్రమ ఇది మా వల్ల కాదు అని వెళ్ళిపోయారు.

మూడవవాడు మాత్రం వీరయ్యతో ఈ బండరాయిని ఇక్కడి నుండి కదిలించి వీధివారగా నెట్టేస్తాను. ఒక గునపం ఇప్పించండి అని రాయి కేసి పరీక్షగా చూస్తూ అసలిది వీధివాకిలి ముందుకు ఎలా వచ్చింది. అంటూ కాలితో నెట్టి చూశాడు. ఖండ రాయి అడుగు దూరం జరిగిపోయింది. అది నిజంగా బండరాయి కాదు. ఎండుగడ్డిని గోతంలో పెట్టి మూతి బిగించి రాయిలా కనబడేందుకు వీరయ్య దానికి మట్టి పులిమాడు. వీరయ్య యజమానితో ఇతనిలో కష్టించి పని చేసే లక్షణంతో పాటు మంచి చరుకు తనం కూడా వున్నది. మీకు తోటమాలిగా పనికివస్తాడు. అని చెప్పాడు భూస్వామి వాణ్ణి తోటమాలిగా నియమించుకున్నాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version