Home » అరిటాకులో అన్నం తినే ముందు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లుతాము అంటే

అరిటాకులో అన్నం తినే ముందు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లుతాము అంటే

by Nikitha Kavali
0 comment
67

మనం సాధారణంగా ఏ  శుభకార్యములైన అరటి ఆకులలో అన్నం వడ్డిస్తూ ఉంటాం. అది మన సంప్రదాయంగా భావిస్తాం. ఇలా అరిటాకులలో అన్నం వడ్డించడం అనేది మన సంప్రదాయమే కాకుండా దాని వెనుక ఒక బలమైన కారణమే ఉన్నదీ.

సాధారణంగా మనం అరటి ఆకులలో అన్నం వడ్డించే ముందు ఆకు చుట్టూ నీళ్లు చల్లి దేవుడికి ప్రార్ధన చేసి అప్పుడు అన్నం వడ్డిస్తాము. దీనినే “చిత్రాహుతి” అని పిలుస్తారు.

ఇలా చేయడం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. పూర్వ రోజులలో ఇంట్లో గచ్చు నేల కాకుండా మట్టి నేలలు ఉండేవి. ఒకవేళ మట్టి నేల పొడి గా ఉంటె గాలి వచ్చినప్పుడు సులభంగా గాలికి మట్టి యెగిరి అన్నం లో పడి ఆహరం ఆశుభ్రం అయ్యేది.

అందుకని నీళ్లు చల్లడం వాళ్ళ ఆ తడికి ఆ మట్టి రేణువులు గాలికి ఎగరవు అప్పుడు ఆహరం శుభ్రంగానే ఉంటుంది. ఇలా మన ప్రతి ఒక ఆచారం వెనుక కచ్చితంగా ఒక దృఢమైన కారణం ఉంటుంది. మన పెద్దలు ఏది కూడా ఊరకనే పెట్టలేదు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version