చాల మందికి భారతీయ కుబేరుడు ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గురించి తెలిసుంటది. కానీ అనంత్ అంబానీ భార్య రాధిక గురించి తెలియక పోవచ్చు. రాధిక మర్చంట్ ADF ఫుడ్స్ లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరియు ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEOగా పనిచేస్తు విజయవంతమైన వ్యాపారవేత్త విరెన్ మర్చంట్, పారిశ్రామికవేత్త శైలా మర్చెంట్ ల చిన్న కుమార్తెగా జన్మించారు.
ఈమె విలాసవంతమైన జీవనశైలిని కొనసాగిస్తుంది. ఖరీదైన వస్తువులు, దుస్తులు ధరించడానికి చాల ఆసక్తి చూపుతారు. రాధిక అనంత్ మర్చంట్ క్లాసికల్ డాన్సర్ కూడాను, ఈమె జియో వరల్డ్ సెంటర్లో 2022 లో క్లాసికల్ నృత్యం ప్రదర్శించి అలరించారు. ఇంకా ఈమె జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులు వంటి పలు సామాజిక అంశాల మీరు కూడా ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు.
తన విద్యను పూర్తి చేసిన తర్వాత, రాధిక ముంబైలోని సెడార్ కన్సల్టెంట్స్‌లో బిజినెస్ స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా ఇంటెన్షిప్ పూర్తి చేసింది. తరువాత విల్లాలు మరియు విలాసవంతమైన గృహాలను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన ఇస్ప్రవా అనే సంస్థలో సేల్స్ మేనేజర్‌గా రాధిక చేసిన ఆలోచనలు రియల్ ఎస్టేట్ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ఈమె ఇస్ప్రవాలో చేరడానికి ముందు “దేశాయ్ & దేవాన్‌జీ” మరియు “ఇండియా ఫస్ట్” వ్యాపారాలలో కూడా పని చేసింది.
రాధికకు, అనంత్ అంబానీతో నిశ్చితార్థం జనవరి 19, 2023 న జరిగింది, వీరి పెళ్లి జులై 12 న జరిగింది. దాదాపు 7 నుండి 8 నెలల పాటు వీరి పెళ్లి వేడుక నిర్వహించారు.
ఈమె తండ్రి, విరెన్ మర్చంట్, ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త, మరియు ఆమె తల్లి, శైలా మర్చంట్, కుటుంబంలో సహాయక పాత్ర పోషిస్తుంది. రాధికకు అంజలి మర్చంట్ అనే సోదరి ఉంది, ఆమె వటాలి వ్యవస్థాపకుడు మరియు అమ్సల్ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన అమన్ మజిథియాను వివాహం చేసుకుంది.
రాధిక మర్చంట్ నికర విలువ దాదాపు 8 మిలియన్ US డాలర్లుగా సుమారుగా అంచనా. ఈమె విలాసవంతమైన జీవనశైలిని ఆనందిస్తుంది, ముంబైలోని తన కుటుంబ బంగ్లాలో నివసిస్తుంది మరియు బహుళ ఆస్తులు మరియు విలాసవంతమైన వాహనాలను కలిగి ఉంది.
రాధిక మర్చంట్ తన పుట్టినరోజును ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న జరుపుకుంటారు. ఈమె సామాజిక సేవ మరియు తన తండ్రి వ్యాపారం కోసం CSR కార్యకలాపాలలో కనిపిస్తుంటారు. రాధికకు ట్రావెలింగ్ మరియు షాపింగ్ అంటే చాలా మక్కువ. ఈమెకు ముంబైలోని అలీబాగ్ మరియు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో గడపడం చాలా ఇష్టం.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.