Home » కోడి నిద్ర – కథ

కోడి నిద్ర – కథ

by Haseena SK
0 comment
37

అనగనగా ఒక ఊళ్లో ఒక జమీందారు ఉండేవాడు.  ఆయన దగ్గర వెంకయ్య నర్సయ్య అని ఇద్దురు పనివాళ్లుండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామును కోడి కూయగానే తనతో పాటే వెంకయ్య నూ నర్సయ్యనూ కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు బద్ధకస్తులైన వెంకయ్య నర్సయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరిమంచం మీద హాయిగా పడుకున్నా ఆయనకి అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తోందా. అని అనుకునే వాళ్లు ఇద్దురూ కొద్ది రోజుల గమనించాక.

ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే ఇలా జరుగుతోందని అనుకున్నారు అందుకే ఆయన దగ్గరి కోడిని ఎవరూ చూడకుండా తీసుకెళ్లి చంపేశారు. తర్వత రోజు కోడి  కూయక పోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్ర లేచాడు ఆ రోజు వెంకయ్య నర్సయ్యలు పొద్దెక్కిందాకా గుర్రపెట్టి నిద్రపోయారు కానీ తానిలా నిద్ర లేవడం వల్ల పనులన్న ఆలస్యమవుతున్నామన్నా ని పోలానికీ ఇబ్బంద వుతుందనీ కంగారుపడ్డ  జమీందారు మర్నాటి నుంచీ ఎలాగైనా వేకవనే లేచాడు. తెల్లవారిపోతోండనే అనుకుని పనివాళ్లనీ నిద్రలేపి పోలానికి పంపాడు. 

తర్వాత నుంచి ఆయనకి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే ఇద్దర్నీ నిద్ర లేపి పన్లోకి పంపడం మొదలు పెట్టాడు. యాజమానిని ఏమీ అనలేని వెంకయ్య నర్సయ్య కోడి ఉంటే కనీసం రోజూ ఒకే సమయానికి నిద్రలేచే వాళ్లమనీ ఇప్పుడు మొదటి కే మోసంవచ్చింది నీ అనుకుంటూ తన బద్ధకానికి తగిన శాస్తి జరింగిదని బ్లాదపడ్డాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version