Home » మోసానికి ఫలితం – కథ

మోసానికి ఫలితం – కథ

by Haseena SK
0 comment
34

ఒక ఊరిలో రాజమ్మ రంగయ్య అనే భార్యాభర్తలుండేవారు. ఇద్దరూ మహా పిసివారు పిల్లికి బిచ్చం పెట్టేవారు కాదు. సంపాదించిన డబ్బున దాచుకోవడమే తప్ప ఖర్చు చేయాలంటే గిలగిల్లాడిపోయే వారు ముఖ్యం గా ఇంటికి చుట్ట పక్కలు రావడం ఆ దంపతులకు అస్సలు ఇష్టం లేదు. చుట్టాలు ఎందుకు దండగ ఊరికే వచ్చి తినిపోతారు. అని వినుక్కునే వాళ్లు .

ఒక రోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతుండగా. దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో బంధువులు వస్తే కొంప గుల్లయిపోతుంది. అని గబగబా లోపలికి పరుగెత్తి ఇదుగో నిన్నే మా చుట్టాలు వస్తున్నారు. 

వాళ్లు ఇక్కడ ఉండకుండా చెయ్యాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అన్నాడు రాజమ్మ అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించగా నువ్వు నీకు అనారోగ్యం చేపినట్లు నటించు అని చెప్పాడు. రంగయ్య చుట్టూల వాకిట్లోకి వచ్చేటప్పటికి రాజమ్మ కిందపడి దొర్లుతా అమ్మో కడుపు నొప్పి చచ్చిపోతున్నాను. అంటూ గిలగిల్లాడి సాగింది.

నేనేం చెయ్యనే వైద్యుడిని పిలుచుకొద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. అంటున్నాడు. రంగయ్య చుట్టాల ఇది విని పాపం వీళ్లు కష్టంలో ఉన్నట్టున్నారు. అనుకుని వెనుదిరిగి వెళ్లిపోయారు. తమ ఎత్తుగడ ఫలించనందుకు రాజమ్మ రంగయ్య పొంగిపోయారు అప్పటి నుంచీ భర్త తరపు బంధువులు వస్తే భార్య భార్య తరపు బంధువులు వస్తే భర్త అనారోగ్యం అభినయించేవాళ్లు

వాళ్లకు ఒక్కగానొక్క కూతురు శారదకు చూసుకోవడానికి పెళ్లి వాళ్లు వచ్చి ఊర్లో వాళ్లును విచారించగా ఏమిటో పాపం పిల్ల మంచిదే అమ్మాయి తల్లిదండ్రులకు ఎప్పుడూ  అనారోగ్యమే అని చెప్పారు. అయితే ఈ సంబంధం మాకొద్దు అని పెళ్లి వాళ్లు పోయారు. ఈ విషయం తెలిసి రంగయ్య రాజమ్ములు పశ్చాత్తాపం చెందారం.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version