Home » కప్ప-ముత్యం – కథ

కప్ప-ముత్యం – కథ

by Haseena SK
0 comment
18

అనగనగా అడవిలో కప్ప హాయిగా జివిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కోలనులో తామరాకుపైనా తేలుతూ, హంస ఒడ్డున నిలబడీ మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చికిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాల్లో తోచలేదు. వేటగాడు…….. దయచేసి తనను విడిచిపెట్టు’ అని ప్రాథేయపడింది.’ దీన్ని అమ్మీతే బోలెడ డబ్బోస్తుంది, వీడిచిపెట్టను’ అన్నాడు. నీకు డబ్బు కావాలి, అంతే కదా! ఉండు’ అని కప్ప వేంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది.’ దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు ‘ అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్లాక అతను చెప్పినదంతా విన్న భార్య….’ ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి. వెళ్లి అవన్నీ తెచ్చెయె’ అని చెప్పింది. దాంతో దురశా కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్లి.’ఏయ్…… మర్యదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చెయ్. లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప…….’సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది. నీకు మేం దొరకం. అత్యాశతో ఉన్నది కూడా పోగోట్టుకున్నావ్. అనుభవించు’ అని అరిచింది. అది విన్న వేటగాడు’ అయ్యె ఎంత పని చేశాను’ అని భాదపడ్డాడు..

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version