30
నిజంలాటి అబద్ధం చెప్పినావారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక తోచి తోచిన రాజు చాటింపు వేయించాడు. బంగారు మామిడి పండు పై ఆశతో ఎందరెందరో పచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు. కాని రాజుకు అవేవి నచ్చేలేదు. అందులో కన్ని నిజం కూడా కావచ్చు మిగిలినని వచ్చి అబద్ధాలు. అందుచేత రాజుగారు బంగారు మామిడిపండును ఎవరికి ఇవ్వలేదు.
ఒకనాడు ఒక బిచ్చగాడు పెద్ద కుండ పట్టుకుని రాజుగారి వద్దకు వచ్చాడు.ఏం కావలి నీకు?” అన్నాడు రాజు. నాకు తమరు ఈ కుండెడు బంగారం బాకీ ఉన్నారు. ఇప్పించండి,” అన్నాడు బిచ్చగాడు. అబద్ధం! నేను నీకేమీ బాకి లేను,” అన్నాడు రాజు. అబద్ధమా? అయితే ఆ బంగారం మామిడిపండు నా ముహానా పారెయ్యంది!” అన్నాడు బిచ్చగాడు. రాజుగారు సంతోషించి వాడికి బంగారు మామిడిపండు ఇచ్చేశాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.