Home » ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు సాధించిన జానీ మాస్టర్ కి ఘన సన్మానం

ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు సాధించిన జానీ మాస్టర్ కి ఘన సన్మానం

by Nikitha Kavali
0 comment
48

ఇటీవల ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తిరుచిత్రాంబలం సినిమాలోని మేఘం కరుగత పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును గెల్చుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయనకు ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

national award winner jani master

ఫిలింఫెడరేషన్ నాయకులు సురేష్ మాట్లాడుతూ “మన తెలుగు చిత్ర పరిశ్రమ మొదట్లో డ్యాన్స్, ఫైట్స్ క్రాఫ్ట్ విభాగాల్లో ఇతర చిత్ర పరిశ్రమల నుంచి అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ అవమానాలను ఎదుర్కొని నిలబడి ఈ రోజు జాతీయ అవార్డ్ అందుకునే స్థాయికి ఎదిగాం. మనకు జాతీయ అవార్డ్ తీసుకొచ్చిన జానీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జానీ మాస్టర్ సాధించిన జాతీయ అవార్డ్ తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఇప్పుడు వస్తున్న కొత్త డాన్సర్లకు మన జానీ మాస్టర్ ప్రేరణగా నిలిచారు. కష్ట పడితే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు అని నిరూపించారు. ఆయన ఇచ్చిన స్పూర్తితో మన డ్యాన్సర్స్, ఇతర క్రాప్ట్ లు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తాయని కోరుకుంటున్నా” అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ “బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డ్ గెల్చుకున్న జానీ మాస్టర్ గారికి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. జానీ మాస్టర్ గెల్చుకున్న నేషనల్ అవార్డ్ ఇతర డ్యాన్సర్స్ కు స్ఫూర్తి కావాలి. ఈ కార్యక్రమంలో ఇటీవల ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్ గారు ఉన్నారు. ఆయన మన సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గతంలో ఎలాగైతే చొరవ చూపించారో ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

jani master wins national best choreographer award

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ “మన గురించి ఎవరేం అనుకున్నా మనం సాధించే విజయాలే జవాబు చెబుతాయి. మీ ఆసోసియేషన్ లోని సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవాలి. బయటకు రాకుండా చూసుకోవాలి. జానీ మాస్టర్ కు తమిళ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. కాబట్టి కళాకారులకు భాషతో సంబంధం లేదు టాలెంట్ తో పాటు కష్టపడే తత్వం ఉంటే మన విజయాన్ని ఎవరు ఆపలేరు. జానీ మాస్టర్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే మరిన్ని విజయాలు ఆయన సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ “నేను, గణేష్, జానీ దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఈరోజు జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మా అందరికీ ఆ అవార్డ్ వచ్చినట్లు ఆనందిస్తున్నాం. గతంలో నార్త్ కు కొరియోగ్రఫీలో నేషనల్ అవార్డ్స్ వచ్చేవి. ఇప్పుడు మనకు రావడం మొదలైంది. జానీ విజయానికి మేమంతా గర్విస్తున్నాం” అన్నారు.

jani master award winning moments

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ “ఎల్వీ ప్రసాద్ గారి ప్రసాద్ ల్యాబ్స్ లో జానీ మాస్టర్ గారికి సన్మానం జరగడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా దిగ్గజం ఎల్వీ ప్రసాద్ గారి ఆశీస్సులు జానీ మాస్టర్ గారికి ఎప్పుడు ఉంటాయి. ఆర్ఆర్ఆర్ కు చంద్రబోస్, కీరవాణి గారికి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డ్ అందుకోవడం తెలుగు పరిశ్రమకు గర్వకారణం. జానీ మాస్టర్ ఎంతోమంది కొత్త డ్యాన్సర్స్ కు అసోసియేషన్ మెంబర్ షిప్ ఇచ్చి వాళ్లు కూడా గొప్ప విజయాలు సాధించేలా చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ “ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులు మమ్మల్ని ఎప్పుడూ బాగా సపోర్ట్ చేస్తుంటారు. సినిమాకు ఆది అంతం నిర్మాతే. ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు. నిర్మాత క్యాషియర్ గా ఉండటం చూస్తున్నాం. కానీ ఆయన కూడా హీరోలాగే ఉండాలి.

ప్రభుదేవా గారు చేసిన వెన్నెలవే వెన్నెలవే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇలాంటి పాట ఒకటి నేనూ చేయాలనే కలగనేవాడిని. ఆ అవకాశం ధనుష్ గారి తిరుచిత్రాంబలంతో నాకు దక్కింది. అక్కడ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసేందుకు నన్నే పిలిపించారు ధనుష్ గారు. ధనుష్ గారికి, తిరుచిత్రాంబలం మేకర్స్ కు మనస్పూర్తి గా ధన్యవాదాలు చెబుతున్నాను.

jani master wins national best choreographer award

మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నాం అంటే అందుకు ముక్కురాజు మాస్టర్, నా ముందున్న డ్యానర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన కృషే కారణం. ముక్కురాజు మాస్టర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని మద్రాస్ నుంచి తెలుగు డ్యాన్సర్స్ ను ఇక్కడికి తీసుకొచ్చి అసోసియేషన్ స్థాపించి నిలబెట్టారు. ఆ పెద్దలు వేసిన బాటలో మేమంతా నడుస్తూ ముందుకెళ్తున్నాం.

మన మాస్టర్స్ ఎన్నో ట్రెండీ స్టెప్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు డ్యాన్స్ మాస్టర్స్ కు బాగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు. నాకు నేషనల్ అవార్డ్ రాగానే డిఫ్యూటీ సీఎం పవన్ గారు అభినందిస్తూ మెసేజ్ పంపారు. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని చెప్పారు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version