Home » అరుదైన అవకాశం – కథ

అరుదైన అవకాశం – కథ

by Haseena SK
0 comment
48

వారణాసిలో ఉంటున్న కృష్ణ మోహన్ పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దోరికింది. అతడా పుస్తకాన్ని అటు ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ స్పర్శకు వెచ్చగా ఉండే.

 ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందనీ అక్కడ రానుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణ మోహన్ ఒక్క రాయి దోరికినా తన జీవితం మారిపోతుందనే ఆశఅతడిది. 

నది ఒడ్డును వారం రోజులు వెతికినా విలువైనా రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. రెండు వారాలు గడిచాయి. రాయిజాడ కనిపెట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణ మోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లెక్కుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు. చివరికి అతడికి అలవాటుగా మారింది.

వెతగ్గా వెతగ్గా ఓరోజు మహిమలున్ను వెచ్చనిరాయి అతడి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించే లోపు అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతి నుంచి జారిపోయే అఖరు క్షణంలో గానీ అతడా విషయాన్ని గమనించలేదు అప్పటికే  జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది.

You may also like

Leave a Comment

Exit mobile version