ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలను ఆనందిస్తారు. శ్రీకాకుళం లో ఎన్నో ఆలయాలు, పురాతన ప్రదేశాలు, అందమైన సముద్రపు ఒడ్డులు, ఇంకా ఏన్నొ ప్రకృతి అందాలు శ్రీకాకుళం లోను మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి. ఆ ప్రదేశాలు అన్నిటి గురించి తెలుసుకుందాం రండి.
తేలినీలాపురం బర్డ్ స్యాంచురి:
శ్రీకాకుళం కి 65 kmల దూరం లో ఉన్న ఇచ్చాపురం అనే మండలం లో తేలినీలాపురం ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో సైబీరియా నుండి వేల సంఖ్యలో పెలికాన్ పక్షులు వలస వస్తాయి. అవి సెప్టెంబర్ నుండి మార్చి వరకు అక్కడే ఉంటూ ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. సైబీరియా నుండి వచ్చే పెలికాన్ పక్షులే కాకుండా ఇక్కడికి 113 రకాల వలస పక్షులు వాస్తు ఉంటాయి. ఇది నిజంగా పక్షుల ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని అందించే ప్రదేశం.
కళింగపట్నం బీచ్:
శ్రీకాకుళం పర్యాటకానికి వచ్చిన ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఈ కాళింగపట్నం. శ్రీకాకుళం కి 27 కి.మీ దూరం లో కాళింగపట్నం ఉంది. కాళింగపట్నం లో సముద్రం ఎంతో పేరు కలిగి ఉన్నది. బ్రిటిషర్లు, పాశ్చాత్య దేశాలు ఈ కాళింగపట్నం సముద్రాన్ని వాణిజ్య వ్యాపారాలకు ముఖ్య కేంద్రంగా వాడేవారు. భారత దేశం స్వతంత్రం పొందాక ఈ సముద్రాన్ని వాణిజ్య వ్యాపారాలకు వాడడాన్ని ఆపేసారు. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రదేశంగా గుర్తించి అభివృద్ధి చేసింది. ఈ కాళింగపట్నం సముద్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.
సాలిహుండం:
వంశధార నది కి దక్షిణ ఒడ్డున, శ్రీకాకుళం కి 18km దూరం లో ఉన్న గార మండలం లోని ఒక గ్రామం సాలిహుండం. సాలిహుండం ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ఆధ్వర్యం లో ఉంది. ఈ సాలిహుండం ని సలివాటిక అని పిలిచేవారు అంటే ధాన్యాగారం. ఇక్కడ ఈ గ్రామం లో ఎన్నో బుద్దుని స్తూపాలు, బుద్ధ గుహలు చాలానే ఉన్నాయి. ఇక్కడ పురాతన కాలం నాటి బౌద్ధ మతానికి, హిందూ దేవుళ్ళకి సంబందించిన శిల్పాలు చాలానే ఉంటాయి. ఈ సాలిహుండం ని కొంచెం ఎత్తుగా ఉన్న కొండా ప్రదేశం లో కట్టడం వాళ్ళ ఇక్కడ నుండి చాల మంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
శ్రీ కూర్మనాథ గుడి:
శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం అయినా కూర్మావతారం లో ఇక్కడ విష్ణువు వెలిశారు. మన దేశం లో విష్ణువును కూర్మావతారం లో పూజించే మూడు దేవాలయాలలో ఇది ఒకటి. ఈ గుడిలో వెలసిన విష్ణువును స్వయంభు గా పిలుస్తారు. గర్భగుడిలో ఉన్న తాబేలు విగ్రహం ఎవరో చెక్కినది కాదు, అది ఒక పెద్ద తాబేలు శిథిలం. ఇతర దేవాలయాల లాగా కాకుండా ఇక్కడ దేవుడు పడమర వైపున ఉంటారు అందుకని ఈ గుడిలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి, ఒకటి తూర్పున, ఇంకోటి పడమర వైపున. ఈ గుడి బయట తాబేలు పార్క్ ఉంటుంది, అక్కడ చాల తాబేలు ఉంటాయి పిల్లలకి అది ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.
అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం:
శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ దేవాలయం తూర్పు శ్రీకాకుళం కి 1km దూరం లో ఉన్న అరసవిల్లి అనే గ్రామం లో ఉంది. మన దేశం లో ఉన్న రెండు సూర్య దేవాలయాలలో ఇది ఒకటి. మన పురాణాలలోని పద్మపురాణం ప్రకారం జన క్షేమం కోసం కశ్యప మహాఋషి ఇక్కడే సూర్య దేవుని విగ్రహాన్ని స్థాపించారు అని చెప్తుంది. ఇక స్థల పురాణం గనుక చూసినట్టు అయితే ఇంద్రుడికి ఇక్కడ గుడి కనిపించినప్పుడు అతను ఇక్కడ సూర్య దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించారు అని ఉంది.
సంవత్సరం లో రెండు రోజులలో అంటే మార్చి లో ఒకసారి అక్టోబర్ లో ఒకసారి ఈ ఆలయం లోని సూర్య భగవానుడి విగ్రహాన్ని పాదాల నుండి శిరస్సు వరకు సూర్యకిరణాలు తాకుతాయి, ఇది ఇక్కడి అద్భుతమైన దృశ్యం.
శ్రీ ముఖలింగేశ్వర గుడి:
శ్రీకాకుళం లోని జలుమూరు మండలం లో ముఖలింగం అనే గ్రామం లో శ్రీ ముఖలింగేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల మూడు ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయం లో ముఖలింగేశ్వర స్వామి, బిమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి రూపాలలో శివుడు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని ఇండో-ఆర్యన్ పద్దతిలో నిర్మించారు. ఆలయం లోని కట్టడాలు ఎంతో అద్భుతమైన భావాన్ని కలిగిస్తాయి.
సంగం:
శ్రీకాకుళం కి 56KM ల దూరం లో వంగర మండలం లో సంగం ఉంది. సంగమేశ్వరునికి సంబందించిన అయిదు లింగాలలో ఒక లింగం ఇక్కడ ఉంది. ఈ ప్రదేశం లో స్వర్ణముఖి, నాగావళీ, వెగవాటి అనే మూడు నదులు కలుస్తాయి దీనినే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా చేస్తారు, పెద్ద సంఖ్య లో భక్తులు శివరాత్రి వేడుకలో పాల్గొంటారు.
గుళ్ల సీతారామపురం:
శ్రీకాకుళానికి 47 కి.మీ దూరంలో ఈ గుళ్ల సీతారామపురం అనే ఊరు ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినది. ఇక్కడ ఉన్న రాములవారి గుడి. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా చేస్తారు. ఈ గుడిలోని శిల్పకళా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
పొందూరు:
పొందూరు లో ఖాదీ వస్త్రాల నేతకు ఎంతో ప్రసిద్ధి చెందినది. మన భరతదేశం లోనే కాకుండా ప్రపంచ కండ్లలో ఈ పొందూరు ఖాదీ వస్త్రాలు గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో నాణ్యమైన దూదితో ఈ వస్త్రాలను నేస్తారు. ఈ ఖాదీ వస్త్రాలలో 1 మీ. వస్త్రాన్ని నేయడానికి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది.
ఇది మన స్వతంత్రం రాక ముందు నుంచే ఇక్కడ వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి. గాంధీజీ కూడా స్వరాజ్య ఉద్యమం లో ఈ వస్త్రాలను ప్రచారం చేసారు. ఆనతి కాలం నుండి నేటి వరకు ఈ వస్త్రాల వాడకం కొనసాగుతూనే ఉంది. ఈ ఊరిలో ప్రతి ఇంట్లో ఒక్కరు అయినా మగ్గం పై ఖాదీ వస్త్రాలను నేస్తారు.
మండస:
ఇది శ్రీకాకుళానికి దగ్గర్లో ఉంది. ఈ గుడిని 14వ శతాబ్దం లో నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు వాసుదేవుని రూపం లో దర్శనమిస్తారు. ఈ గుడిలో ఉండే కోట దక్షిణ భారత దేశం లోనే ఎతైన కోట గా పరిగణిస్తారు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.