నీలగిరి కొండలలో నెలకొని ఉన్నా ఊటీ (ఉదగమండలం) పశ్చిమా కనుమలలో ఉంది, దీనిని “క్వీన్ అఫ్ హిల్ స్టేషన్” అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ అందమైన ప్రదేశేలతో కూడి ఉంటుంది, ఇది తమిళనాడు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చందిన హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. ఊటీ పచ్చని కొండలు, తేయాకు తోటలు, నీలి కొండలు, చేతితో తయారు చేసిన చాక్లేట్లులు, సరస్సులు, జలపాతాలు, బాగా అభివృద్ధి చేందిన పర్యటక క్రీడలు మరియు ఆహ్లదకరమైన వాతావరణం కలిగివుంటుంది. ఊటీ స్థానిక కార్యకలాపాలకు మరియు ప్రతి సంవత్సరం అనేక మంది అంతర్జాతీయ పర్యాటకులకు అత్యింత ప్రసిద్ది గమ్యస్థానాలలో ఒకటి.
ఊటీకీ ఎలా చేరుకోవాలి?
ఊటీలో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాల గురించి, ఈ మార్గాలలో ఎలా చేరుకోవాలో అని చూదాం.
రాడ్లు మార్గం : బెంగుళూరు నుంచి 300 కిలోమీటర్లు , కోయంబత్తూర్ నుంచి 88 కిలోమీటర్లు, చెన్నై నుంచి 558 కిలోమీటర్లు, హైద్రాబాద్ నుంచి 847 కిలోమీటర్లు మరియు సమీప నగరాల నుండి ఇక్కడికి బస్సులు మరియు ప్రైవేట్ క్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గం : కోయంబత్తూర్ నుండి మెట్టుపాళయం 40 కిలోమీటర్లు లో వుంది. కోయంబత్తూర్ ఊటీ కి సమీప రైల్వ స్టేషన్. ఊటీకి చేరుకోవడానికి చాలా రైళ్లు ఉన్నాయి బెంగుళూరు, కోయంబత్తూర్, మైసూర్ మరియు చెన్నై సమీప నగరాల నుండి అందుబాటులో ఉన్నాయి. మీరు నీలగిరి రైల్వ స్టేషన్ (టాయ్ రైల్), లో కూడా వెళ్ళవచ్చు ఈ రైల్ ఊటీ నుండి కూనూర్, మెట్టుపాళయం వరకు కాలుతుంది.
విమాన మార్గం : ఊటీ నుండి కోయంబత్తూర్ నుంచి 57 కిలోమీటర్లు దూరంలో ఉన్న సమీప విమానసైర్యం, ఇది హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరు వంటి వివిధ నగరాల నుండి అనేక రకాల దేశీయ విమానాలను అందిస్తాయి. ఇక్కడ సింగపూర్ మరియు ఇతర ప్రదేశాలకు కూడా విమానాలు ఉన్నాయి.
ఊటీలో కచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు జాబితా
- దొడ్డబెట్ట శిఖరం
- ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్
- ఊటీ సరస్సు
- టాయ్ రైలు
- ప్రభుత్వ రోజ్ గార్డెన్స్
- పైన్ ఫారెస్ట్
- ఫైకారా జలపాతాలు మరియు ఫైకారా బోట్ హౌస్
- దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ మరియు టీ మ్యూజియం
- లాంబ్స్ రాక్ వ్యూ పాయింట్
- డాల్ఫీన్ నోస్ వ్యూ పాయింట్
- ఊటీ స్టోన్ హౌస్
- టిబెటన్ మార్కెట్
- తొడ ట్రైబ్స్ దేవాలయం
దొడ్డబెట్ట శిఖరం (DODDABETTA PEAK)
దొడ్డబెట్ట శిఖరం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ (ఉదగమండలం) పట్టణానికి సమీపంలో పశ్చిమ మరియు తూర్పు కనుమల జంక్షన్‌లో ఉంది. ఈ శిఖరం సముద్ర మట్టానికి 2,637 మీటర్లు (8,65 అడుగులు) ఎత్తులో ఉంది, ఇది దక్షిణ భారతదేశంలో ని రెండవ ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి రహదారి సౌకర్యంతో మరియు అత్యంత ప్రసిద్ధ చెందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. దొడ్డబెట్ట పై భాగంలో రెండు టెలిస్కోప్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీనిని 1983 జూన్ 18న అప్పటి తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. దొడ్డబెట్ట శిఖరం పరిసర ప్రాంతాల దృశ్యాలు చాలా అందంగా మరియు ప్రకృతి దృశ్యాలు, పచ్చని లోయలు, అడవులు మరియు టీ ఆకూ తోటలు ఇలా చాలా ఉన్నాయి. నీలగిరిలోని ఈ దొడ్డబెట్ట శిఖరం సుందరమైన క్రీడకు మరింత అద్భుతంమైనది.
ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ (GOVERNMENT BOTANICAL GARDENS)
ఊటీ ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ అత్యంత అందమైన తోటలలో ఒకటి. ఈ తోటలు 55 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మొక్కలు ఫెర్న్స్ (ferns), ఆర్చిడ్స్ (orchids) మరియు బోన్సాయ్ (bonsai), ఇలంటి చాలా అన్యదేశ మొక్కల జాతులు ఉన్నాయి. 20 మిలియన్ల సంవత్సరాలకు పైగా పురాతనమైన చెట్టు యొక్క శిలాజ ట్రంక్ కూడా ఉంది. ఈ ఊటీ ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ బాగా అభివృద్ధి చేయబడింది మరియు చక్కగా నిర్వహించబడుతుంది మరియు చక్కగా నిర్వహించబడిన తోటలు.
ఊటీ సరస్సు (OOTY LAKE)
ఊటీ సరస్సు ఈ కృత్రిమ సరస్సు 19వ శతాబ్దం ప్రారంభంలో 1824లో నిర్మించబడిన మానవ నిర్మిత సరస్సుకు (Man Made Lake) అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. ఇది ఊటీ పట్టణం నడిబొడ్డున ఉంది, ఇది బోటింగ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఊటీ సరస్సు చుట్టూ చుట్టుపక్కల యూకలిప్టస్ చెట్లులతో నిండి ఉంటుంది, మరియు నీలగిరి కొండల అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. ఈ సరస్సు “L” ఆకారంలో కనిపిస్తుంది. ఊటీ సరస్సులో బోటింగ్ ఒక అందమైన అనుభూతి అని చెప్పవచు. అక్కడ వివిధ రకాల బోట్లు ఉంటయి అవి మోటర్ బోట్, పెడల్ బోట్ రా బోట్ మరియు పిల్లల కోసం చాలా రకాలా గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మిర్రర్ హౌస్, కొలంబస్ రైడ్, హర్రర్ హౌస్ మరియు డ్యాషింగ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఊటీ సరస్సు అందాలను సందర్శించి ఆస్వాదించడానికి ఇది అనువైన షూటింగ్ ప్రదేశం.
టాయ్ రైలు (TOY TRAIN)
టాయ్ రైలు ఒక అద్భుతమైన అనుభవం మరియు ఈ రైలులో సుందరమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ (UNESCO) హెరిటేజ్ సైట్ కి చెందిన రైల్వేస్టేషన్. ఈ టాయ్ రైలు లో ప్రయాణం చేసే తప్పుడు చిత్రాల ద్వారా, లోయలు, పచ్చని టీ ఆకూ తోటలు, సొరంగాలు మరియు ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ టాయ్ రైలు నీలగిరి కొండల ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది.
ప్రభుత్వ రోజ్ గార్డెన్స్ (GOVERNMENT ROUSE GARDENS)
రోజ్ గార్డెన్ ఊటీలో అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది, ఇది భారతదేశంలోని అతిపెద్ద గులాబీ తోటగా ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన రోజ్ గార్డెన్ లో 20,000 రకాల గులాబీలకు నిలయంగా ఉంది. ఈ రోజ్ గార్డెన్ రంగురంగుల మార్గాల ద్వారా, ఫ్లోరిబండస్, మినియేచర్, హైబ్రిడ్ టీ గులాబీలు మరియు అధిరోహకులు మొదలైన వాటిని నిర్వహించారు. ఈ గులాబీల సువాసనలు, రంగులు, ఆకారాలు చాలా బాగుంటాయి. ఈ రోజ్ గార్డెన్ పచ్చటి పచ్చదనంతో ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ఈ తోటల యొక్క అందమైన దృశ్యాలను అందిస్తుంది. రోజ్ గార్డెన్ యొక్క అందమైన దృశలను చూసి ఆనందించండి.
పైన్ ఫారెస్ట్ (PINE FOREST)
పైన్ ఫారెస్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన షూటింగ్ స్పోర్ట్, ఈ పైన్ చెట్లు నీలగిరి పర్వతాలలో మునిగిపోయిన చిన్న కొండ ప్రాంతంలో క్రమబద్ధంగా మరియు అమర్చబడి ఉంటాయి. ఈ పైన్ చెట్లు 3 నుండి 8 మీటర్ల పొడవు ఉంటయి. ఈ పైన్ చెట్లు సతత హరిత మరియు సుందరమైన వాతావరణాన్ని కలిగి చూస్తాయి. పైన్ అడవిలో 100 నుండి 1000 సంవత్సరాల నాటి చెట్లు ఉన్నాయి మరియు కొన్ని 4000 సంవత్సరాల వయస్సు గల చెట్లు కూడా ఉన్నాయి. ఈ చెట్లను ఫర్నిచర్ నిర్మాణాలలో మరియు ఉత్పత్తులను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పైన్ ఫారెస్ట్ ప్రదేశాలు సినిమాలకు మరియు సీరియల్స్ షూటింగ్‌లకు ఇది చాలా ప్రసిద్ధ చెందిన ప్రదేశం. ఆ పైన్స్ మోనోసియస్ (Monoecious) అని కొన్ని ఆడ మరియు మగ కోన్ ఒకే చెట్టుకు ఏర్పడుతాయి. ఆ ఒకో కోన్ 0.5 నుండి 12 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ కోన్ దాని మందపాటి మరియు పొలుసులతో కూడిన బెరడుల ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు కామరాజ్ సాగర్ డ్యామ్ ఒడ్డుకు చేరుకోవడానికి 200 మీటర్లు నడిచి మరియు గుర్రపు స్వారీ వారివి. పైన్ చెట్లలో తక్కువ ఆక్సిజన్ విడుదల అవుతుంది.
ఫైకారా జలపాతాలు మరియు ఫైకారా బోట్ హౌస్
ఫైకారా జలపాతాలు (PYKARA WATERFALLS)
పైకారా జలపాతాలు ఊటీ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పైకారా జలపాతాలు అద్భుతమైన జలపాతం మరియు ఈ ప్రశాంతమైన జలపాతాలు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. పచ్చని లోయలు మరియు పైన్ అడవుల మధ్య ఉన్న పైకారా జలపాతాలు యొక్క ప్రశాంతమైన పరిసరాలు. జలపాతాలు పక్కన వాతావరణం చుట్టూ పక్కల సుందరమైన పరిసరాలు మరియు రిలాక్సింగ్ వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ బోట్ రైడ్స్ మరియు ప్రకృతి దృశ్యాలు ఇలా అందమైన దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ జలపాతంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు మరియు బోటింగ్ కూడా అనుమతి లేదు.
పైకారా బోట్ హౌస్ (PYKARA BOAT HOUSE)
ఈ పైకారా బోట్ హౌస్, ఇది పైకారా జలపాతాల నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు మరియు స్నాక్ బార్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు కోసం ఆడుకునే ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ బోట్ రైడింగ్ కోసం వివిధ రకాల పడవలు కూడా ఉన్నాయి. అవి మీటర్ బోట్, పెడల్ బోట్, రా బోట్ మొదలైనవి.
దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ మరియు టీ మ్యూజియం (DODDABETTA TEA FACTORY AND MUSEUM)
దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ మరియు టీ మ్యూజియం నీలగిరి కొండల్లోని నీలి కొండల మధ్య 2005లో మజీ టీ బోర్డు మెంబర్ ఐన N.K కృష్ణమూర్తి చేత ప్రారంభించబడింది. ఈ ఫ్యాక్టరీ 1 ఎకరాల అంతటా విస్తరించి ఉంది. ఈ టీ ఫ్యాక్టరీలో నెలకు 30 టన్నుల టీ పొడి చేయబడుతుంది. ఈ టీ ఫ్యాక్టరీలో మన ప్రపంచం భారతదేశం ఇక్కడ టీ తయారు చేయబడుతుంది అని చార్టుల రూపంలో అమర్చబడి ఉంది. అంటే టీ ఆకూ తో టీ పౌడర్‌ను ఎలా తయారు చేయాలి, టీ ఆకూ ను ఎలా కట్ చేయాలి, ఎలా ట్విస్ట్ చేయాలి అనే ప్రాసెసింగ్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ ఇలా రకరకాల టీ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టీ ఫ్యాక్టరీ సమీపంలోనే నీలగిరి ఎసెన్షియల్ ఆయిల్స్ మరియు హెర్బల్ పౌడర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. టీ ఫ్యాక్టరీ సమీపంలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా టీ ఫ్యాక్టరీ పైనే నిర్మించబడింది.
చాక్లెట్ ఫ్యాక్టరీ
ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో స్వచ్ఛమైన చేతితో తయారు చేసిన చాక్లెట్లు కూడా తయారు చేయబడతాయి. ఇక్కడ చాలా రకాలా చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ చాక్లెట్లు చాలా రుచి ఫ్రెష్ గా ఉంటాయి. టీ ఫ్యాక్టరీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీ సమీపంలోనే పిల్లలకు మరియు పెద్దల కోసం చాలా ఔట్ డోర్ ఆక్టివిటీస్ ఉన్నాయి. అవి ఈగల్స్ డేర్, జిప్ స్వింగ్, జిప్ లైన్ మరియు అనేక సాహస కార్యకలాపాలు ఉన్నాయి.
లాంబ్స్ రాక్ వ్యూ పాయింట్ (LAMB’S ROCK VIEW POINT)
లాంబ్స్ రాక్ కూనూర్‌లోని అత్యంత అందమైన మరియు విశాల దృశ్యాలలో ఒకటి. ఇది ఊటీ నుండి దాదాపు 25 మీటర్ల దూరంలో ఉంది. ఈ దట్టమైన అడవి చుట్టూ ఉన్న ఈ మార్గాల లాంబ్స్ రాక్ వ్యూ పాయింట్ పైకి చేరుకోవడానికి 20 నిమిషాలు పాటు నడవాలి. ఇక్కడ నుండి మీరు కర్ణాటక మరియు కేరళ రాష్ట్ర దృశ్యాలను చూడవచ్చు. ఇది లాంబ్స్ రాక్‌లో 3వ మరియు ఆకరి వ్యూ పాయింట్.
డాల్ఫీన్ నోస్ వ్యూ పాయింట్ (DOLPHIN NOSE VIEW POINT)
డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ పర్వతాల యొక్క అందమైన మరియు ఉత్కంఠభరితమైన వీక్షణలను అందిస్తుంది. ఇది ఊటీ నుండి దాదాపు 30 మీటర్ల దూరంలో ఉంది మరియు కూనూర్ నుండి 12 మీటర్ల దూరంలో ఉంది. ఈ వ్యూ పాయింట్ సముద్ర మట్టానికి 1,550 మీటర్లు మరియు 5075 అడుగులు ఎత్తులో ఉంది. ఈ వ్యూ పాయింట్ ఆకారం “డాల్ఫిన్ నోస్” లాగా కనిపిస్తుంది. ఇక్కడ దిగువన కేథరీన్ జలపాతం మరియు కోటగిరి ప్రవాహాలు ఉన్నాయి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుండి 360 డిగ్రీల వరకు వీక్షణ చేయవచ్చు. మీరు ఎక్కడ ఉన్న రాష్ట్రాలను ఉపయోగించి పైకి ఎక్కవచ్చు మరియు మీరు ఎక్కడ గుర్రపు స్వారీ, బోటింగ్, పిక్నిక్‌లు మరియు టీ ఎస్టేట్‌లను ఆస్వాదించడం వంటి కొన్ని అడ్వెంచర్‌లను కూడా ఇక్కడా ఉన్నాయి.
ఊటీ స్టోన్ హౌస్ (OOTY STONE HOUSE)
ఊటీ స్టోన్ హౌస్ ను ఉదగమండలంలోని ప్రభుత్వ మ్యూజియం అని కూడా పిలుస్తారు, ఇది ఊటీ బస్టాండ్ నుండి 3 మీటర్ల దూరంలో ఉంది. ఈ స్టోన్ హౌస్ ఊటీలో రాయితో నిర్మించిన మొదటి కల్ బంగ్లా. ఇది 1822లో 19వ శతాబ్దం ఊటీ (ఉదగమండలం)లో మొదటి కలెక్టర్ “జాన్ సుల్లివన్” చేత ప్రారంభించబడింది. ఈ స్టోన్ హౌస్ ఇప్పుడు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో భాగం మరియు ప్రిన్సిపాల్ యొక్క అధికారిక నివాసాలుగా పనిచేస్తుంది. ఇక్కడ “కల్ ” అంటే రాయి మరియు “బంగ్లా” అంటే మ్యూజియం. స్టోన్ హౌస్ చుట్టూ పక్కల పచ్చదనం మరియు పర్వతాలతో నిండి ఉంటుంది.
ఈ స్టోన్ హౌస్ ప్రభుత్వ మ్యూజియం యొక్క నిలయంలో ప్రాంతం యొక్క చరిత్ర, సంస్కృతి, శిల్పాలు, పెయింటింగ్‌లు, తొడ ట్రైబ్స్ ప్రజల జీవావరణ శాస్త్రాన్ని చూపుతుంది. అంతే కాకుండా భౌగోళిక నమూనాలు, ప్రాచీన శిల్పాలు, సంగీత వాయిద్యాలు, తోడా తెగలు మొదలైన వాటికి అందమైన వివిధ రకాల విభాగాలను అన్వేషించవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు అక్కడకు వస్తుంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం మరియు 2వ శనివారాలు ప్రభుత్వ సెలవులు.
టిబెటన్ మార్కెట్ (TIBETAN MARKET)
టిబెటన్ మార్కెట్ షాపింగ్ చేయడానికి అత్యంత ప్రసిద్ధ చెందిన గమ్యస్థానం. ఇది బొటానికల్ గార్డెన్ సమీపంలో ఉంది. ఇక్కడ షాల్స్, వెచ్చని ఉన్ని వస్త్రాలు, జాకెట్లు, గ్లోవ్‌లు, ముఫ్రల్స్, మంకీ క్యాప్స్, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్‌లు, సాంప్రదాయ కళలు వంటి అనేక వెచ్చని శీతాకాలపు దుస్తులను కొనుగోలు చేయడానికి ఇది సరైన ప్రదేశం. ఇక్కడ ఉత్పత్తులు చాలా మంచి నాణ్యత కలిగి ఉంటారు మరియు అన్ని ఉత్పత్తులను ఫిక్స్ డ్ రేట్ల లకు అమ్మబడును.
తొడ ట్రైబ్స్ దేవాలయం (TODA TRIBES TEMPLE)
తొడ ట్రైబ్స్ ప్రజల దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల ఊటీ (ఉదగమండలం) నుండి ఒక చిన్న మతసంబంధమైన సమాజంలో నివసిస్తున్నారు. తొడ ట్రైబ్స్ గుడి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్‌లో ఉంది. ఊటీలోని “ముండ్స్” అని పిలవబడే వారి నివాసాలలో ఉన్న ప్రత్యేకమైన గుడిసెలు, ప్రధానంగా పశువులు మరియు నిల్వ కోసం మరియు వారి వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది. తోడా తెగ దేవాలయం “గుడిసె” ఆకారంలో నిర్మించబడింది. ఈ దేవాలయం ద్వారం ఏకశిల గతంలో ఉపయోగించిన తోడా ఆలయంలో విగ్రహాలు ఏవీ లేవు. కానీ దేవాలయం ద్వారం మీద గేదె, చంద్ర దేవుడు మరియు సూర్య దేవుడు చిత్రాలు ఉంటయి. ఈ దేవాలయంలో శ్రీలకు అనుమతి లేదు కానీ వారు దూరం నుండి చూడవచ్చు.
ఊటీని సందర్శించడానికి ఉత్తమ సీజన్
వేసవిలో ఊటీ
మార్చి నుండి మే వరకు, ఊటీ ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఉష్ణోగ్రతలు 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఈ వేసవి కలంలో చాలా మంది పర్యాటకులు ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీరు కుటుంబంతో కలిసి పిక్‌నిక్‌లు, ఊటీ సరస్సులో బోటింగ్, గుర్రపు స్వారీ ఇలా మొదలైన అనేక కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.
వర్షాకాలంలో ఊటీ
జూన్ నుండి మే వరకు, ఊటీలో రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. వాతావరణం అందంగా మరియు ప్రాంతాలలో పచ్చదనంతో నిండి ఉంటుంది. వర్షాకాలంలో అద్భుతమైన చిత్రాలను రూపొందిదుకుంటుంది. కానీ వర్షాకాలంలో భూమి చాలా జారే రోడ్లు విధంగా ఉంటాయి. అందు వల్ల ప్రయాణ ప్రణాళికలను నిలిపివేయగలవు. కాబట్టి సందర్శించే ముందు వాతావరణం మరియు రహదారి పరిస్థితులను తెలుసుకొండి.
శీతాకాలంలో ఊటీ
డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు, ఉష్ణోగ్రతలు 5 నుండి 15 cl వరకు ఉంటాయి. శీతాకాలంలో ఉదయం మరియు సాయంత్రం పొగమంచుతో ఆస్వాదించడానికి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. టీ ఈస్టర్లు, టీ తోటలు, క్యాంపింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి ఇతర కార్యకలాపాలకు కూడా ఇది ఉత్తమ సమయం.
ముగింపు
ఊటీ నీలగిరి కొండల ప్రకృతిని ఆస్వాదిస్తూ దాని అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మరియు కార్యకలాపాలను ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది ఊటీ యొక్క ఉత్కంఠభరితమైన వీక్షణలను అందిస్తుంది. ఇక్కడ సొరంగాలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకునే వాతావరణం, టీ దుకాణాల, పచ్చదనం, నిర్మలమైన సరస్సులు, తొడ ట్రైబ్స్ ప్రజల మరియు జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
మరిన్ని అద్భుతమైన ప్రదేశాల కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.