విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఒక గొప్ప నగరం. ఈ నగర చరిత్ర పురాణ కథలతో ముడిపడి ఉంది. కథనాల ప్రకారం, ఇంద్రకీలాద్రి పర్వతంపై నివసించిన కణకదుర్గ అమ్మవారు రాక్షసుడిని వధించి ఈ ప్రాంతానికి “విజయం” సాధించినందున, “విజయవాడ” అనే పేరు వచ్చింది.
ప్రకృతి అందించే అందాలు ఇక్కడ మనస్సు ప్రశాంతగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా విజయవాడ కృష్ణ నది అనుకుని ఉండటం వలన ఆ కృష్ణమ్మా పరవళ్లు ఉరకలు వేయడం నేరుగా చూసే అవకాశం దొరుకుతుంది. విజయవాడలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు మరియు అనుభవాలు గురించి చూడండి.
1. కనక దుర్గా దేవి ఆలయం
ఇంద్రకీలాద్రి పర్వతం పై ఉన్న ఈ ఆలయం లో కనక దుర్గా దేవి అమ్మవారు దర్శనమిస్తుంది. ఏటా జరిగే నవరాత్రులు వేడుకలు ఇక్కడ ప్రముఖమైనవి. భక్తులు ఎల్లపుడు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో వస్తూవుంటారు. పైగా ఈ ఆలయం కొండ పై ఉండడం తో అక్కడ వీక్షించే ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. భక్తులకు సాధారణ దర్శనం తో పాటు ప్రత్యేక దర్శనాలు మరియు పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రత్యేకమైన రీతిలో అమ్మవారిని దర్శించుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
2. ప్రకాశం బ్యారేజ్
ప్రకాశం బ్యారేజ్ పైకి వెళ్లి కృష్ణా నది ప్రవాహన్నీ మరియు బ్యారేజ్ కనుమేరలో ఉన్న పల్లె ప్రాంతాలను తిలకించడం మంచి అనుభవాన్ని ఇస్తుంది. ప్రధానంగా సాయంకాలంలో బ్యారేజ్ లైట్ల కాంతుల్లో ప్రకాశిస్తూ, నదీ తీరంలో అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఆ వీక్షణ దట్టమైన గాలి, చల్లటి వాతావరణంతో చాలా హాయిని కలిగిస్తుంది. రైడింగ్ బోట్స్, క్యానోయింగ్ లాంటి వాటిని ప్రయత్నించవచ్చు. ఈ బ్యారేజ్ వీక్షణకే కాకుండా సమీప జిల్లాలకు సాగు నీరు అందిస్తుంది. ఈ నీటి మీదనే ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
3. భవాని ఐలాండ్
కృష్ణ నది మధ్యలో ఉంది ఈ దివి, పచ్చని చెట్లు, పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులకు ఒక ప్రశాంత అనుభవం కలిగిస్తుంది. ఇక్కడ బోటింగ్, క్యానోయింగ్, జెట్ స్కీయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇది కుటుంబాలు, స్నేహితులతో కలిసి సాహసాలు అనుభవించడానికి మంచి ప్రదేశం. కొన్ని స్ధలాలలో క్యాంపింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి, దీనివల్ల పర్యాటకులు నది తీరంలో రాత్రిని గడిపే అనుభవాన్ని పొందవచ్చు. మరియు గ్రీన్ రిసార్ట్ లాంటి విశ్రాంతి కేంద్రాలు పర్యాటకులకు అనేక సౌకర్యాలు అందిస్తాయి. భవాని ఐలాండ్‌లోని రెస్టారెంట్లు, క్యాఫేలు పర్యాటకులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తాయి. ఆలా మీరు ప్రకృతి వడిని ఆస్వాదిస్తూ చిల్ అవ్వడానికి సరైన ప్రదేశం.
4. ఉండవల్లి గుహలు
ఉండవల్లి గుహలు అంటే ఇవి ఒక రాతి కొండా ను దేవాలయం గా చెక్కడం వలన ఏర్పడిన గుహలు. ఇవి రాక్-కట్ ఆర్కిటెక్చర్ లో ఒకే ఆలయం లో మిళితమైన చాలా గుహలుగా మనకు కనిపిస్తాయి. ఈ గుహలను ఒక ‘రాక్షసుడు’ తన ఒట్టి చేతులతో ఒకే రాత్రిలో చెక్కాడని నమ్ముతారు!. ఈ గుహల్లో విస్తృతమైన శిల్ప కళ కనిపిస్తుంది. ప్రత్యేకంగా, శివుడి మరియు పార్వతీ దేవతల విగ్రహాలు, మరియు బౌద్ధ ఆచారాలను సూచించే చిహ్నాలు ఉంటాయి. అంతేకాకుండా ఓక పెద్ద విష్ణువు విగ్రహం,నరసింహ, రామాయణం మరియు ఇతర విష్ణు కథలను తెలిపే ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గుహలను జైన మరియు బౌద్ధ సన్యాసులు ఉపయోగించుకుంటున్నారు.
5. కొండపల్లి కోట
ఈ కోట పర్వత శ్రేణుల మధ్య నిర్మించబడి ఉంది, అందువలన ప్రజలకు పర్యాటక ప్రదేశంగా నిలిచి ఎన్నో ప్రకృతి అందాలను అందజేస్తుంది. ఈ కోట చరిత్రలో అనేక రాజ వంశాలు పాలించిన ప్రదేశం. ఇది ప్రత్యేకంగా గజపతి రాజుల పాలనలో ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. ఈ కొండపల్లి కోట లో విహార మందిరం, నర్తనశాల, రాణిమహల్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే, కోటలో కొన్ని ప్రాంతాలు శిథిలావస్థలో ఉన్నాయి, కానీ మరికొన్ని అందమైన దృశ్యాలను అందిస్తాయి. చారిత్రక కట్టడాలను ఇష్టపడే ఇక్కడే వస్తే ఆనందిస్తారు.
6. రాజీవ్ గాంధీ పార్క్
రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. విస్తారమైన స్థలం, అందమైన ఉద్యానవనాలు, వంతెనలు, మరియు పచ్చని మైదానాలను కలిగి ఉంది. అలాగే ఈ పట్టణ పార్క్, పిల్లల కోసం మినీ జూ వంటి మంచి నిర్వహణ చేయబడిన తోటలు కలిగి ఉంది. ముఖ్యంగా ఈ పార్క్ లో సాయంత్రం నిర్వహించే సంగీత ఫౌంటెయిన్ షోలకు ప్రసిద్ధి. పార్క్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించి, కుటుంబాల కోసం విహారానికి అనుకూలమైన ప్రదేశంగా మారింది.
7. విక్టోరియా మ్యూజియం
విక్టోరియా మ్యూజియం విజయవాడలోని ప్రఖ్యాత పురాతన చరిత్ర కలిగిన మ్యూజియంగా పేరొందింది. మ్యూజియంలో, ఆదిమానవులు ఉపయోగించిన వస్తువులు, మట్టిపాత్రలు, కళాఖండాలు, శాసనలిపి పలకలు, పురాతన నాణాలు వంటి అనేక ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉన్నాయి. ఈ మ్యూజియం పర్యాటకులకు ప్రాచీన భారతదేశం గురించి ఒక వినూత్న అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా, ఈ మ్యూజియంలో 3-4 వ శతాబ్దాలకు చెందిన నల్లరాతి (గ్రానైటు) బుద్ధ విగ్రహాలు మరియు ఇతర అనేక విలక్షణ వస్తువులు ప్రదర్శించబడుతున్నాయి.
8. మంగలగిరి ఆలయం
పానకాల నరసింహస్వామి దేవాలయం విజయవాడ సమీపంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. భక్తులు సమర్పించిన పానకం లో సగం స్వామి స్వీకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. పానకం స్వీకరించేటపుడు గుటక వేసిన శబ్దం కూడా వినిపిస్తుంది. భక్తులు తమ బాధలను తగ్గించుకునేందుకు, ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. అలాగే ఈ ఆలయం సమీపంలో ఉన్న మెట్ల మార్గం గుండా వెళితే గండాల నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకి అక్కడున్న అఖండ దీపంలో నూనె పోస్తే గండాలు పోతాయని భక్తుల నమ్మకం.
9. గాంధీ హిల్
గాంధీ హిల్ ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ కొండ, గాంధీ స్టూపా అని కూడా పిలవబడుతుంది, మహాత్మా గాంధీ 1929లో విజయవాడలో సందర్శించిన సందర్భాన్ని గుర్తించడానికి 1968లో నిర్మించారు. గాంధీ హిల్ సముదాయంలో ఒక స్మారక గ్రంథాలయం, ప్లానిటోరియం, మరియు చుట్టుపక్కల నగర దృశ్యాలను అందించే రైలు ఉన్నాయి. సందర్శకులు ప్రతి సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షోని కూడా ఆస్వాదించవచ్చు. ఈ కొండ అందమైన ఉద్యానవనాలతో చుట్టబడింది, ఇది విశ్రాంతి మరియు వినోదానికి అనుకూలమైన ప్రదేశంగా మారింది.
10. మోగలరాజాపురం గుహలు
మోగలరాజాపురం గుహలు ఒక ప్రాచీన రాతి-కట్ గుహల సముదాయంగా ఉంది, ఇవి 5వ శతాబ్దానికి చెందినవి. ఈ గుహలు విష్ణుకుండిన రాజవంశం కాలంలో చెక్కబడినట్లు భావిస్తున్నారు. ఐదు గుహ దేవాలయాలు ఉన్నప్పటికీ, మూడు మాత్రమే బాగా సంరక్షించబడ్డాయి. వీటిలో, హైలైట్ నటరాజ స్వామికి అంకితం చేయబడిన ఒక గుహ మందిరం. ఈ కాలం నాటి నటరాజ విగ్రహం ఉన్న దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి కాబట్టి ఈ గుహ ప్రత్యేకమైనది. ఈ మోగలరాజాపురం గుహలు కృష్ణా నదికి సమీపంలో ఉన్నాయి, కాబట్టి చుట్టు ప్రక్కల ఉన్న దృశ్యాలను పర్యాటకులు చూస్తూ అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు.
మరిన్ని ఇటువంటి ప్రదేశాల కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.