Home » రాక్షసుడు – కోతి – కథ

రాక్షసుడు – కోతి – కథ

by Haseena SK
0 comment
29

ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మిక్కిలి క్రూరుడు కనిపించనజంతువు నల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవితో జంతువుల సంఖ్యా తగ్గిపోతూ వస్తోంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకు ఒక్క జంతువులకు ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడ అంగీకరించాడు. 

రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది ఒక రోజు ఒక కోతి పిల్ల వంతు వచ్చింది. కోతి పిల్ల ఒక కట్టెల మోపుకు నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురులేకుండా వెళుతున్న కోతి పిల్లిలను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి.కోతి పిల్ల వెళ్లి రాక్షనుడి ఎదురుగా నిటారుగా నిలుచున్నది. అది చూసి రాక్షసుడు ఓసీ మర్కటమా నన్ను చూస్తేనే అడవిలోకి జతువులన్నీ గజ గజ వణికిపోతున్నాయి. నీవు ఎంత పొగరుతో నిలుచున్నావు. అని హుంకరించాడు.

అప్పుడు కోతి పిల్ల మహానుభాహ తమ వంటి గొప్ప వారికి ఆహారంగా రావడం నా అదష్టం కానీ నాకొక సందేహం అన్నది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్యసాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి. నిజమేనా అని కన్పించింది. కోతిపిల్ల ఎవరా మాటన్నది నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు అన్నాడు. రాక్షసుడు కోతి పిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి పరచి దానికి నిప్పంటించి రాక్షసుడిని అందులో దూకమన్నది రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి ఆనందితో నాట్యం చేసింది. మిగతా జంతులన్న వచ్చి కోతి పిల్లను అభినందించాము.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version