Home » బాధ్యత ఎవరిది? (Who Is The Responsibility)

బాధ్యత ఎవరిది? (Who Is The Responsibility)

by Vinod G
598 views
who is the responsibility

🤚 హయ్ తెలుగు రీడర్స్ ! ప్రయాగలోని కుంభమేళకి విపరీతమైన జనసంద్రోహం పెరుగుతున్న నేపథ్యంలో మనం ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా, ఎక్కడైనా సరే పుణ్యం వచ్చేస్తుందనో లేదా నేత్రానందం కోసమో లేదా వేరే ఇతర ఉబలాటం కొద్దీ రద్దీగా ఉండే ప్రదేశాలకు పరిగెత్తకండి. అక్కడ ఏవైనా తోపులాటలు తొక్కిసలాటలు జరిగితే వెంటనే ఒక రాజకీయ నాయకుడి మీదో, పోలీసులపైనో, సెలెబ్రిటీల మీదో, లేదా ప్రవచన కర్తల మీదో వాటిని తోసేయకండి.

రద్దీగా ఉన్న ఒక క్రికెట్ స్టేడియంకి ఎవరైనా చిన్న పిల్లలను తీసుకు వెళ్ళారనుకోండి, అక్కడ ఏమైనా తొక్కిసలాట జరిగి అక్కడ అవాంఛనీయమైన ఘటన జరిగితే చిన్న పిల్లలను తీసుకెళ్లిన తల్లితండ్రులదా లేక క్రికెట్ అదే ప్లేయర్స్ దా ఆ తప్పు ? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటివి ఏమైనా జరిగితే సర్వసాధారణంగా మనం పోలిసుల మీద రుద్దేస్తుంటాం. మన దేశంలో 600 మంది జనాలకు ఒక పోలీసు లెక్కన ఉన్నారని మీకు తెలుసా. మామూలుగా మన ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటేనే మనం కంట్రోల్ చేసుకోలేక పోతున్నాం, మరి పోలీసులు కూడా మనుషులే కదా. “మనం గుర్తుంచుకోవాలి ప్రధాన బాధ్యత మనం వహించాలి”. అంతే కానీ సెలెబ్రిటీలు లేదా రాజకీయ నాయకులు లేదా పోలీసుల మీద తోసెయ్యడం మంచిది కాదు. ఏదేమైనా చివరికి మనకే నష్టం అని గుర్తించండి.

ఈ మధ్య కాలంలో ఒక సినిమా విషయంలో ఇలాగే జరిగింది, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో కూడా ఇలానే జరిగింది, అలాగే కుంభమేళాలో కూడా, ఇంకా ఇలాంటివి ఎన్నో గతంలో చూశాం. ఎక్కడైనా సరే ముందు “మన భద్రత అనేది మనం గుర్తుంచుకోవాలి”. పుణ్యం వచ్చేస్తుందనో లేదా నేత్రానందం కోసమో లేదా వేరే ఇతర ఉబలాటం కొద్దీ ఇటువంటి పనులు చేయకపోవడమే మంచిది. ప్రతివక్కరికి పుణ్యం కావాలి అలాగే నేత్రానందం కావాలి. కానీ వీటికోసం మరొక అవకాశం వచ్చేవీలుంటదేమో కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా! కొద్దిగా ఆలోచించండి.

పాత రోజులలో అయితే ఇటువంటి తంతులు మనం అక్కడికి వెళితే గాని చూడడం కుదిరేది కాదు. కానీ ఇప్పుడలా లేదు కదా ఏ ఈవెంట్ అయినా లైవ్ లో వచ్చేస్తుంది. కాబట్టి వీలు కుదరని వాళ్ళు ఇంట్లోనే ఉండి సంతృప్తి పొందవచ్చు, మీకు వీలు కుదిరినప్పుడు ప్రశాంతంగా వెళ్ళ వచ్చు.

🙏ధన్యవాదాలు.

ఇటువంటి మరిన్ని వాటికోసం సంప్రదించండి తెలుగు రీడర్స్

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.