Home » వ్యాపారం పోటి – కథ

వ్యాపారం పోటి – కథ

by Haseena SK
230 views
story of vyaparan poti

శేషయ్య భూషయ్యలు ಆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్థులు ఇద్దరి మధ్య గట్టి పోటీ వుండేది. ఒక రోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాకు తల ఎత్తి ఎవరన్నట్టు అతడికేసి చూశాడు. అయ్యా నాపేరు తిరుపతి శేషయ్య వద్ద గుమాస్తాగా పనిచేసేవాణ్ణి అక్కడ జీతం సరిపోక పనిమానేశాను మీ దగ్గర ఖాశీవుంటే చేస్తాను అన్నాడు. భూషయ్యక్షణం ఆలోంచిం ఇక్కడ కొంత కాలం పని చేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకం ఏమిటో అన్నాడు. జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడడంలో తప్పు లేదు కనండీ అన్నాడు తిరుపతి.

నిన్ను పనిలోని తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభంవుందా. అని అడిగాడు భూషయ్య మీరనేది. నాకార్థాకాలేదండీ అన్నాడు తిరుపతి వినియంగా అదే అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోందీ. వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య అది కుదురుదండి ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చేబితే, మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు. తిరుపతి ఎందుకనీ అంటూ భూషయ్య కాస్త మాటసాగదీశాడు. 

ఇక్కడి విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు. అన్నాడు తిరుపతి ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి తిరుపతీ నీ జవాబు నీ తెలివి తేటల్నీ కాదు నిజాయితీనీ కూడా ఆ శేషయ్యకూ వ్యాపారంలో పోటియే గాని గుమాస్తాల విషయంలో పోటి లేదు  రా, రా ఈ పద్దు పుస్తకం అందుకో  నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను. అన్నాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.