Home » వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comments
vanneladi joru jonna koyya podham rave folk song lyrics

అరే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
నీది మునుము నాది మునుము నేనే కొత్త నిన్నే జూత్త
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే

చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర
అవ్వజూస్తది అయ్యజూస్తడు అన్నజూసిన నిన్ను దంతడు
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర

ఉయ్యాల నడుముదాన ఊరించే కళ్లలదాన
అతిపెద్ద గుమ్మడికాయ చిన్నకత్తి కోస్తడె జాన
సురకత్తి సూపులవాడ సరసాల వన్నెకాడ
ముద్దుగా నీముచ్చట్లు రేపినాలు ప్రేమ అసలు
సీరలుదెత్త రైకలుదెత్త గల్ గల్ సప్పుళ్ళ గాజులుదెత్త పిల్లో..

వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర

చిలక పలుకులదాన పూస నడకలదాన
కోరినావు ఆ నెలవంక తెచ్చి నీ కొప్పునబెడతా
ఉంగరాలజుట్టు వాడ పట్టేప బీడ వాడ
ఆరడుగుల హైటునుజూసి ఐసోలే కరిగెను మనసు
ఈడు జోడు కుదిరెను పోరి అవ్వతోడు నిన్ను ఇడువను నారి చిన్నదాన

వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు పోర

గల్ గల్లు గాజులువెట్టి కాళ్లకు పట్టీలువెట్టి
నీ గాజులు గల్లు గల్లు నా గుండె జల్లు జల్లు
పట్టంచు దోతిగట్టి కిర్రు చొప్పులు తొడిగి
చిట్టపట్ట నువ్వే పొంగా నాపానం మిట్ట మిట్ట
జూడే నారి ఎలక్షన్ పోరి నేతిలో మొలక నా రామ చిలక

వన్నేలాడి
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవది పోర
చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవది పోర

చేతిలో చేత్తిరిబట్టి చెన్నంగి పువ్వులుబెట్టి
వయ్యారి నా రసగుల్ల ఆగలేనె మరదలు పిల్ల
గట్టెంట పొయ్యేటోడ కత్తెర జుంకాలోడా
నీ బిత్తర సూపులకు చిత్తయి పోతిని పోర
నువ్వు నేను కూడుకొని కొండగట్టుకు పోదము పిల్ల పిల్లో..

వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే
మెచ్చినానురో పిల్లగా కలిసిమెలిసి ఉందము పార
మెచ్చినానురో పిల్లగా కలిసిమెలిసి ఉందము పార


సెలయేరు పారుతుంటే సాంగ్ లిరిక్స్ – జానపద సాంగ్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.