Home » నీ కాలి గజ్జెల పట్టీలు (Ni Kaali Gajjela Pattilu) సాంగ్ లిరిక్స్ Folk

నీ కాలి గజ్జెల పట్టీలు (Ni Kaali Gajjela Pattilu) సాంగ్ లిరిక్స్ Folk

by Lakshmi Guradasi
723 views
Ni Kaali Gajjela Pattilu Song Lyrics Folk

పిల్ల నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు

ఊరికి పోయేటి తోవాలు
నడి మధ్యన వాగులు వంకాలు
నాకేమో మస్తుగా భయ్యాలు
తోడురమ్మని పిలిచనోయి బావాలు

అయ్యో దేనికే పిల్ల భయాలు
నీ తోడుగా నేనున్నా అమ్ములు
నువ్వు నాపైనా చూపే ప్రేమలు
నా గుండెలో నింపాయి ధైర్యాలు

నా సక్కని సుక్కై ప్రేమాలు
నీపై కలకాలంముంటాయి అమ్ములు

నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు

ఆ రాజన్న సిరిసిల్ల చిరాలు కట్టుకొని అమ్ములు
పచ్చని పైరుల్లో నడిచొస్తే నా గుండెల్లో ఏదో సంతోషాలు
తల మీద సుట్టావు రుమాలు చేతికి తొడిగావు కడియాలు
పైనంగా తిప్పావు మీసాలు అది చూసి నాలో ఆనందాలు
నిన్ను జేసుకుంటా గారాలు పెట్టమాకు పై పై బేరాలు
అయ్యో పెట్టబోను బేరాలు నాకు ఇట్ఠమే నీ గారాలు
కోటి ఆశల నా కలల ప్రపంచంలో నువ్వు నిజమల్లే వచ్చావు అమ్ములు

నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు

ఆ గోదారి అలలెల్ల ప్రేమాలు పొంగి పొర్లేనే అమ్ములు
నీ పైన నా కోటి ఆశలు నా మనసంతా నువ్వే అమ్ములు
నీ ప్రేమకు పడిపోయా బావాలు నీ మాటను దాటని సీతాలు
నువ్వు సై అంటూ జేసింది సైగాలు ప్రేమ అల్లుకుపోతానోయ్ బావాలు
రంగు రంగు కొత్త లోకాలు మనమందులో ప్రేమ జంటాలు
నీ సరసన ఉంటే సరదాలు ప్రతిరోజు పండగే బావాలు
నా బంధము నువ్వే బలగం నువ్వే బతుకు బాటల్లో వెలుగు నువ్వే

నీ కాలి గజ్జెల పట్టీలు
అబ్బా నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు

అరె ఊరికి పోయేటి తోవాలు
నడి మధ్యన వాగులు వంకాలు
నాకేమో మస్తుగా భయ్యాలు
తోడురమ్మని పిలిచనోయి బావాలు

అయ్యో దేనికే పిల్ల భయాలు
నీ తోడుగా నేనున్నా అమ్ములు
నువ్వు నాపైనా చూపే ప్రేమలు
నా గుండెలో నింపాయి ధైర్యాలు

నా సక్కని సుక్కై ప్రేమాలు
నీపై కలకాలంముంటాయి అమ్ములు
లలలల…. లలలల
లలలల……లలలలల

______________

గాయకులు: సుమన్ బదనకల్, మౌనిక
సాహిత్యం: చౌహాన్
సంగీతం: వెంకట్ అజ్మీరా
నటీనటులు: కిట్టు పవన్, రీను SK
DOP | సవరణ | దర్శకత్వం: సూర్య సురేష్
ప్రొడక్షన్ మేనేజర్: మేసు వెంకీ
కొరియోగ్రఫీ: గంగాధర్ & వంశీ
నిర్మాత: రవీన్ బి

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.