ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందంగా వెళ్ళాలి అని మనం ఎన్నో ప్ప్రయత్నాలు చేస్తుంటాం. ఆయా ప్రయత్నాలలో ఎన్నో రకాల క్రీములు, సీరంలు వాడుతూ ఉంటాం. ఎప్పుడూ క్రీంలు వాడడమే కాకుండా అప్పుడప్పుడు మనం వంటింట్లో ఉండే పధార్ధాలతో కూడా మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. సాధారణంగా మనం పార్టీలకు వెళ్ళేటప్పుడు అందరం కచ్చితంగా ఎంతో కొంత మేకప్ వేసుకోనే వెళ్తాము. కానీ ఆ మేకప్ కొంత సమయం కన్నా ఎక్కువ సేపు ఉండదు మరియు చూడటానికి అంత నాచురల్ గాను ఉండదు. అందుకే ఈసారి ఇలా ఇంట్లో ఉన్నవాటితోనే తయారు అయ్యి వెళ్ళండి. ఎప్పుడూ బయట దొరికే రెడీమెడ్ క్రీమ్ లు వాడడం అంటే మంచిది కాదు, ఎందుకంటే అవి తాయారు చేసే విధానం లో మన చర్మానికి హాని చేసే రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా అవి ఎంతో ఖరీదు కూడాను. అందుకే ఈరోజు మీ ముందు మన ఇంట్లో ఉండే నాలుగే పధార్ధాలతో మీ మొహం కాంతివంతంగా మెరిసిపోయేలా ఒక అద్భుతమైన చిట్కా మీకోసం ఇక్కడ వివరిస్తున్నాము.
కావలిసినవి:
- టమోటా రసం
- సెనగ పిండి
- పెరుగు
- రోజ్ వాటర్
పేస్ ప్యాక్ తయారీ విధానం
ఈ పేస్ ప్యాక్ తయారీ విధానం లో ముందుగా 4 స్పూన్ల సెనగపిండిని తీసుకోండి. తరువాత ఒక టమోటాని తీసుకొని రెండు భాగాలుగా కోయండి వాటిలో ఒక భాగం నుంచి రసం తీయండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న సెనగపిండిలో ఈ టమోటా రసాన్ని వేసి బాగా కలపండి. తరువాత ఒక రెండు చెంచాల పెరుగు తీసుకొని ఆ మిశ్రమం లో కలపండి, అలాగే ఆ మిశ్రమం యొక్క చిక్కదన్నని బట్టి రోజ్ వాటర్ ని కలపండి. మరి గట్టిగ కాకుండా మరియు మరీ నీళ్లలా కాకుండా ఆ మిశ్రమం మీ మొహం మీద రాసుకున్నప్పుడు కారిపోకుండా ఉండేలా కలుపుకోండి. ఇప్పుడు మిగిలిన టమోటా భాగంతో ఈ మిశ్రమాన్ని మీ మొఖం మీద ఒక సర్కులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ పట్టించండి. ఒక అరగంట పాటు ఈ పేస్ ప్యాక్ ను ఉంచిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. ఈ పేస్ ప్యాక్ ను మీరు పార్టీ లకి వెళ్లేముందు కానీ లేదా ముఖ్యమైన కార్యాలకు వెళ్లేప్పుడు కానీ వేసుకోవచ్చు. అలాగే ఇంకా మీరు దీనిని రాత్రి పడుకొనే ముందు కానీ లేదా బయట ఎండ నుంచి వచ్చిన తర్వాత కానీ వేసుకోవచ్చు ఇలా చేయడం వలన మీ మొహం మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.