మన వంటింట్లో ఉండే వాటిలో సగ్గుబియ్యం చాల మందికి ఎంతో ప్రీతికరమైనది. సగ్గుబియ్యం తో మనం ఎన్నో రకాల వంటకాలు చేస్తూ ఉంటాం సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం దోస, ఇలా ఎన్నో రకాల వంటకాలు చేస్తూ ఉంటాం.
ఇలా రకరకాల వంటలే కాకుండా దింతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సగ్గుబియ్యం వంటికి ఎంతో చలువ చేస్తుంది కూడాను. ఈరోజు ఇక్కడ సగ్గుబియ్యం తో ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడీని ఎలా చేయాలో చూసేద్దాం రండి.
కావలసినవి:
సగ్గుబియ్యం: 1 కప్పు
పల్లీలు : 50 గ్రా
జీలకర్ర: 1 1/2 స్పూన్
ఆళ్లగడ్డ: 1 చిన్నది
పచ్చి బటానీలు: 1 చిన్న కప్పు
ఎర్రగడ్డ: 1
పచ్చి మిరపకాయలు: 2
కరివేపాకు: 2 రెమ్మలు
అల్లం: చిన్న కొమ్ము
టమోటా: 1 చిన్నది
కొత్తిమీర: 2 రెమ్మలు
సాల్ట్: రుచి కి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంని నాలుగు గంటల సేపు నీళ్లల్లో నానబెట్టుకోండి. తరువాత నానిన సగ్గుబియ్యంని తీసి నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోండి.
పొయ్యి మీద పాన్ పెట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వెసి, నూనె కొంచెం వేడయ్యాక 50 గ్రాముల పల్లీలను అందులో వేయించి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు అదే నూనెలో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగిన ఆళ్లగడ్డ ముక్కలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ, పచ్చి మిర్చి తురుము, ఒక చిన్న కప్పు పచ్చి బటానీలు, అల్లం తురుము, చిన్నగా కోసిన టమోటా ముక్కలు అన్ని వేసి ఆళ్లగడ్డ మెత్తపడే వరకు కొంచెం సేపు ఉడకనివ్వండి. తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ని దింట్లో వేసి బాగా కలిపేయాండి.
ఇక చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా తరిగిన కొత్తిమీర పైన వేసి గార్నిష్ చేసేస్తే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి తయారీ అయిపొయింది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.