Home » పిరికి జింక

పిరికి జింక

by Haseena SK
0 comments
Piriki jiṅka

ಓ వనంలో ఒక జింక ఉండేది. అది సీతాకోక చిలుకను చుసినా బెదిరిపోయేది. అందుకే జంతువులన్నీ దాన్ని’ పిరికి జింక’ అని ఏడిపించేవి. జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయింది. అందుకే ఒక రోజు ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన సమస్యకు పరిష్కారం చూపించ మని తాబేలును అడిగింది.’ నీ కన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సన పనిలేదు. అలా ಅನಿ వాటిని చులకనగా చూడొద్దు. నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు. హాయిగా నవ్వుతో వాటిని పలకరించు. పెద జంతువులతో వినయంగా ఉండు. వీటిని పాటిస్తూ ఉంటే నిన్ను ఎవ్వరూ పిరికిపంద అనరూ’ అని చెప్పింది తాబేలు. దానికి కృతజ్ఞతులు చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయింది జింక. దారిలో దానికొక కుందేలు కనిపించింది.’మిత్రమా బాగున్నావా?’ అని పలకరించింది.’ ఎప్పుడు నన్ను చూడగానే భయంతో పరిపోయే ఈ జింక ఏంటి ఈ రోజు ಇಲಾ పలకరిసోంది!’ అనుకుంంది కుందేలు.’ నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు కదా! అని సమాధనమిస్తూ అక్కడ నుంచి వెళ్ళింది కుందేలు. జింక చెరువు వైపు నడిచింది. అక్కడ కొంగల గుంపును చూసి………..’మిత్రూ లారా……. మీరూ పాలలాగా స్వచ్చమైన రంగులో ఉన్నారు. మిమ్మల్ని నేను ఎప్పటి  నుంచో చూస్తున్నా…….కానీ మీతో నాకు స్నేహం లేకపోవడం బాధాకరం’ అంది. అవి నవ్వుతూ మాట కలిపాయి. అక్కడి నుంచి బయలుదేరిన జింకకు ఏనుగు ఎదురైంది.’ ఏనుగన్నా…….బాగున్నారా?’ ಅನಿ వినయంగా దాన్ని పలకరించింది. జింక తనను అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పులకరించిపోయింది. వెంటనే తన చాటంత చేవులుపుతూ……….’ బాగు నాన్ను……. జింక……..నువ్వెలా ఉన్నావు?’ అని సమాదానం ఇచ్చింది.’ మీలాంటి గజ రాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా………. మాకెందుకు బెంగ’ అంది జింక. దీంతో ఏనుగు మరింతగా పొంగిపోయింది. ఇలా అడవి జంతువులన్నీంటితో జింకకు స్నేహం ఏర్పడింది. తనలోని పిరికితనాన్ని పోగొట్టి, జంతువులన్నింటితో స్నేహం ఏర్పడేలా చేసిన తాబేలుకు కృతజ్ఞతులు చెప్పింది జింక.

మన ప్రవర్తనతో అందరిನಿ కలుపుకుని పోవచ్చు……..

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.