Home » పనిని బట్టే మర్యాద – నీతి కథ

పనిని బట్టే మర్యాద – నీతి కథ

by Haseena SK
0 comment
53

లక్ష్మీపురం అనే ఊరిలో గ్రామ దేవత పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పండునాడు అమ్మవారిನಿ ఒక బండిలో ఊరేగిస్తారు. అందుకోసం ఆ ఊళ్లో ఒక ఎద్దును ఎంపిక చేస్తారు పండుగ కొంత కాలం ఉందనగా ఆ ఎద్దుకు మంచి ఆహారంతో పాటు చాలా జాగ్రత్తగా చూసుకొంటారు. ఊరి జనమంతా ఆ ఎద్దును భక్తిగా చూస్తారు. ఈ ఏడాది పండుగలకు లక్కీ అనే ఎద్దును ఎపింక చేశారు. ఊరి జనం తనను ప్రత్యేకంగా చూడడంతో లక్కికి గర్వం పెరిగింది. పండునాడు జనమంతా తనకు వంగి వంగి దండాలు పెడుతుంటే అవంతా తన గొప్పతనమని పొంగిపోయింది పండుగ ముగిసింది. ఉత్సవ విగ్రహాన్ని బండిపై నుంచి గుడిలోకి తీసుకెళ్లారు. జనం ఇక లక్కీని పట్టించుకునేవారే కరువయ్యారు కొంతసేపటికి దాని యజమాని వచ్చి పశువులు పాకలో కట్టేసి వెళ్లిపోయాడు ఇంతకాలం తనను దక్కిను మర్యాదను చూసి ఉప్పోంగి పోయిన లక్కీ వాస్తవం తెలుసుకోవడం చాలా కాలం పట్టింది.

నీతి : మనం చేస్తున్న పనిని బట్టే మర్యాద ఉంటుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version