Home » కుందేలు నిజాయితీ – నీతి కథ 

కుందేలు నిజాయితీ – నీతి కథ 

by Lakshmi Guradasi
0 comment
104

ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒకరోజు ఆహారం కోసం వెతుకుతునప్పుడు ఒక అందమైన తోట కనిపించింది. ఆ తోట లో క్యారెట్లు, మరియు పాలకూర నిండుగా ఉన్నాయి. ఆ తోట ఒక గుడ్లగూబ నిర్మించింది, జంతువులను ఒక షరతుతో మాత్రమే తినడానికి అనుమతినిస్తుంది. వారు తమ ఆహారంలో కొంత భాగాన్ని నైవేద్యంగా ఉంచాలి.

ఒక రాత్రి, పౌర్ణమి వెలుగులో, కుందేలు తోటలోకి ప్రవేశించి విందు ఆహారం తింటూ ఉంది. అప్పుడే ఈ తోట గుడ్లగూబదాని గుర్తొచ్చింది. కానీ, రుచికరమైన ఆహారానికి టెంప్ట్ అయిన కుందేలు, ఎవరు గమనించరని భావించి, కొంచెం ఎక్కువుగా తీసుకోవాలని అనుకుంది.

అప్పుడే, గుడ్లగూబ కనిపించింది, దాని కళ్ళు చంద్రకాంతిలో మెరుస్తున్నాయి. “మీ వాటా కంటే ఎక్కువ ఎందుకు తీసుకున్నావు?” అని అడిగింది.

కుందేలు సిగ్గుపడుతూ ఒప్పుకుంది. గుడ్లగూబ, “నిజాయితీ అన్నింటికంటే గొప్ప నైవేద్యం, మీకు అవసరమైనది మాత్రమే తీసుకోండి, మిగిలిన వాటిని ఇతరులకు వదిలివేయండి” అని సమాధానం ఇచ్చింది.

కుందేలు నిజాయితీ గురించి విలువైన పాఠాన్ని నేర్చుకుంది.

నీతి: తప్పు చేసిన నిజాయితీగా ఒప్పుకునే సామర్ధ్యం ఉండాలి.

మరిన్ని ఇటువంటి నీతికథల కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చుడండి.

You may also like

Leave a Comment

Exit mobile version