Home » తాబేలు మరియు ఎలుగుబంటి – నీతి కథ

తాబేలు మరియు ఎలుగుబంటి – నీతి కథ

by Shalini D
0 comment
98

ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తనకు చాలా బలం వుందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాడిని ఏడిపించేది, హింసించేది. దానితో అవిన్ని ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరుగడ అవుతుందా అని ఎదురుచూడసాగాయి. ఆ అడవిలో సింహలు, పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. 

ఎలుగుబంటి ఒక రోజు అడవిలోని జంతువులను అన్నింటిని పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్లు ఎవరుయినా ఉన్నారా. ఉంటే నాతో పోటీకి రండి. లేకపోతే రేపటినుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు వినాలి. అని సవాలు చేసీంది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. 

ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనికొంది. వెంటనే అది ఎలుగుబంటిముందుకు వచ్చి “ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దుంకుతా. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగగలవా. నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్లు ఎవరు లేరు” అనింది. ఆ మాటలకు ఎలుగుబంటి పడీ పడీ నవ్వుతూ “ ఏందీ… నిన్ను నేను బయటికి లాగలేనా. గట్టిగా ఒక్క లాగు లాగేనంటే ఎగిరి చెరువులోంచి బయటకువచ్చి పడుతావు. 

నేను పోటీకి సిద్ధం” అంది.  తాబేలు సరే నేను నీళ్లలో బాగా అడుగుకు పోతాను. చెతనైతే లాగు చూద్దాం అంటూ  ఒక కాలికి తాడు కట్టుకొని బుడుంగున నీళ్ళలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందకు పోయంది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది.  ఎలుగుబంటి ఇదింత తెలీదు కదా.. దాంతో లాగడం మొదలు పెట్టింది. ఎంత  లాగినా తాడు కొంచెం కూడా కదల లేదు. లాగి లాగి దానికి చేతులు నోపి పెట్టాయి. ఆఖరికి “ ఇంకా నా చేత కాదు” అంటూ తల దించుకొంది. 

వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకొంది. ఏమీ తెలీని నంగనాచి లెక్క పైకివచ్చి  “ ఓస్.. నీ బలమింతేనా… ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు” అంది. అది చూసి చుట్టూవున్న  జంతువులు అన్ని పడీపడీ నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికీ మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలో జంతువులు అన్ని సంబారంగా చిందులు వేశాయి. 

కథ యొక్క నీతి: తాబేలు మరియు ఎలుగుబంటి కథ యొక్క నీతి ప్రధానంగా అహంకారం, సహాయం మరియు స్నేహం. ఎలుగుబంటి తన శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటే, తాబేలు తన తెలివి మరియు ధైర్యంతో ఎలుగుబంటిని ఎదుర్కొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది, అహంకారంతో కూడిన వ్యక్తులు ఎప్పుడూ విజయం సాధించలేరు, కానీ సహాయం మరియు స్నేహం ద్వారా మనం ఏదైనా కష్టాన్ని అధిగమించవచ్చు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version