ఒక ఊరిలో ఒక కోడిపెట్ట దాని పిల్లలు ఉండేవి. ఒకరోజు కోడిపెట్ట తన బంధువులు చనిపోయారని పక్క ఊరికి వెళ్ళాలి అనుకుంది. అందుకు ఆ కోడిపెట్ట తన పిల్లలను పిలిచి, అందరూ కలిసికట్టుగా, జాగ్రత్తగా ఉండండి. “ఎవరినీ నమ్మొద్దు “ అని చెప్పి వెళ్ళింది. కోడి వెళ్లడం చుసిన నక్క ఎలాగైనా కోడిపిలల్ని తినాలి అనుకుంది.
నక్క కోడిపిలల వచ్చి మీరు రాత్రికి ఎక్కడ పడుకుంటారు? అని అడిగింది. మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం! అని చెప్పాయి. నక్క రాత్రికి వచ్చి తినొచ్చులే అని వెళ్లిపోయింది. అప్పుడే కోడిపిలలకు “ఎవరినీ నమ్మొద్దు” అని వాళ్ళ అమ్మ చెప్పిన విషయం గుర్తుకువచ్చింది. అవి తెలివిగా తమ గూట్లో ముళ్లు పడేసి బయట ఉన్న పొదల్లో పడుకున్నాయి. రాత్రి కాగానే నక్క వచ్చి గూట్లో మూతి పెట్టింది. దాని మూతికి ముళ్లు గుచ్చుకుపోవడంతో అరుస్తూ అడవిలోకి వెళ్లిపోయింది.
తరువాత రోజు పొద్దునే నక్క మళ్లీ వచ్చింది. కోడిపిల్లలూ! ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు? అని అడిగింది. అమ్మ చేసిన “పొయ్యిలో పడుకుంటాం” అని ఆ పిల్లలు చెప్పాయి. నక్క మళ్లీ రాత్రికి వస్తుంది అని తెలిసి కోడిపిలలన్ని చిన్న చిన్న పుల్లలతో పొయ్యిలో మంటపెట్టాయి. అది చూసుకోకుండా నక్క వచ్చి పొయ్యిలో తలపెట్టింది. అంతే నిప్పులు తగిలి మూతి మాడిపోయింది.
అయినా నక్క బుద్ధి మారలేదు, తరువాత రోజు పొద్దునే మళ్లీ వచ్చింది. ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారుర్రా? అని అడిగింది. అదిగో ఆ “గడ్డివాములో పడుకుంటాం” అన్నాయి. కోడిపిల్లలు నక్క మూతి మీద ముళ్లు గుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు చూసి, అది తమని తినడానికి వస్తుంది అని తెలుసుకున్నాయి. ఎలాగైనా దాని పిడ వదిలించుకోవాలి అనుకుంటాయి. రాత్రి అవన్నీ అటక మీదకెక్కి నక్క రాకకోసం చూస్తున్నాయి. నక్క వచ్చి కోడిపిల్లల కోసం గడ్డివాములోకి దూరింది. వెంటనే కోడిపిల్లలు అటక మీద నుంచి దిగి గడ్డివాముకు నిప్పు అంటించాయి. ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది.
తరవాత రోజు తల్లి కోడి రాగానే పిల్లలు జరిగిందిఅంతా చెప్పాయి. పిల్లల తెలివిని తల్లి కోడి మెచ్చుకుంది. ‘ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వేళ్లను’ అని తన రెక్కల కింద దాచుకుంది.
మరిన్ని ఇటువంటి వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను చుడండి.