Home » బడాయి ఎలుక – నీతి కథ

బడాయి ఎలుక – నీతి కథ

by Rahila SK
0 comment
61

అరవిందాపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు. తన ఆవులను రోజూ పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు. పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది. ఆ పిలల్లు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న అవును చూశాయి. అంత పెద్ద అవును చూసి భయంతో పరుగెత్తుకుని వెళ్లి తల్లికి చెప్పాయి. అక్కడే ఉన్న మరో ఎలుక… ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది. చాలా పెద్దదని ఎలుక పిలల్లు చెప్పాయి. ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి… ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శేరీరం ఇంతకటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఇంకా పెద్దగా ఉంటుందని జవాబిచ్చాయి. ఈసారి ఇంకా ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువగా తినేసరికి పొట్ట పగిలి అక్కడే చనిపోయింది.

నీతి: తన తాహతకు మించి బడాయికి పోరాదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version