ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ఎద్దు ఉండేది. దానికి తిరగడం బాగా అలవాటు. ఆ ఎద్దు తిరుగుతూ తిరుగుతూ ఒక అడవికి చేరింది. తన గ్రామానికి తిరిగి వచ్చేటపుడు వచ్చిన దారి మర్చిపోయింది. గ్రామానికి వేళ దారి వెతుకుతుండగా ఒక చెరువు దగ్గరకు చేరుకుంటుంది. చెరువులో ఉన్న నీరు త్రాగి పక్కనే ఉన్న పచ్చని గడి బాగా కడుపు నిండా తింటుంది. తిన్న తరువాత ఎద్దు చాల సంతోషముగా ఉన్నది. మరియు తల పైకి పెట్టి అరవడం మొదలుపెట్టింది. అదే సమయంలో అడవికి రాజు అయిన సింహం చెరువు వైపు నీరు తాగడానికి వస్తుంది.ఎద్దు అరుపులు విన్న సింహం రాజు ఏదో భయంకరమైన జంతువు అని సింహం భయంతో తన గృహ వేపు పారిపోతాయి. సింహం అల భయపడి పారిపోవడం రెండు నక్కలు చూస్తాయి. ఆ రెండు నక్కలు అడవికి రాజు అయిన సింహాన్ని మంత్రి కావాలి అని అంకుంటాయి. సింహం నమ్మకం గెలవడానికి ఇదే మంచి సమయం అని అనుకుంటాయి. ఆ రెండు నక్కలు సింహం గృహ వద్దకు వచ్చి మీరు భయం తో పరుగెత్తుతూ గృహ వద్దకు రావడాన్ని మేము చుసేము. నువ్వు విని భయపడిన అరుపు ఒక ఎద్దుది అని నక్కలు చెప్పాయి. మీకు కావాలి అంటే ఎద్దున్నీ తీసుకొని వస్తాం అని చెప్పాయి. సింహం దానికి సరే అని చెపింది. అప్పుడు రెండు నక్కలు ఎద్దు తమతో తీసుకొని వచ్చి సింహానికి పరిచయం చేస్తాయి. కొంత కలం తరువాత సింహం మరియు ఎద్దు చాల మంచి స్నేహితులు అయ్యాయి. ఎద్దు, సింహంకు సలహా దారుడు గా ఉంటుంది. వాటి మధ్య స్నేహాన్ని చూసి నక్కలు మండిపడ్డారు. ఎందుకు అంటే మంత్రి కావాలి అనుకున్న ఆలోచన ఫలించలేదు. ఆ తరువాత ఆ రెండు నక్కలు ఒక ఉపాయం వేసుకొని సింహం వద్దకు వెళ్లి. నక్కలు సింహం తో ఎద్దు నీతో స్నేహం చేసినట్లు నటిస్తుంది. అది నిను చంపి అడవికి రాజు కావాలి అని చెప్తుంటే మేము విన్నాము అని. ఆ రెండు నక్కలు సింహానికి చెప్పాయి. మొదట సింహం వారి మాటలు నమ్మలేదు. కానీ తరువాత సింహం కి అనుమానం వచ్చింది. తరువాత ఆ రెండు నక్కలు ఎద్దు దగిర కి వెళ్లి సింహం నీతో స్నేహం చేస్తునట్టు నటిస్తుంది. దానికి అవకాశం వచ్చినపుడు నీను చంపుకు తినాలి చూస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎద్దుకు చాల కోపం వచ్చింది. వెంటనే ఆ ఎద్దు సింహాన్ని కలవడానికి పోయింది. నక్కలు అప్పటికే సింహం వద్దకు వెళ్లి అదిగో నీను చంపడానికి ఎద్దు వస్తుంది. ఎద్దు కోపంతో రావడం చూసి సింహం. నక్క మాటలు నమ్మి ఎద్దుపై దాడి చేసింది. ఎద్దు కూడా సింహం పై దాడి చేసింది. సింహం మరియు ఎద్దు తమతో తాము పోరాడుతున్నాయి. చివరకు సింహం ఎద్దును చంపి నక్కలను తన మంత్రిగా నియమించుకుంది.
నీతి: ఇతరులు మాటలు విని మన స్నేహాన్ని మనం ఎప్పుడు అనుమానించుకోకూడదు. ఈ కథ మనకు నేర్పుతుంది. మంచి స్నేహితులు దొరకడం చాల కష్టం.