Home » జింక నక్కల గుంపు – నీతి కథ

జింక నక్కల గుంపు – నీతి కథ

by Haseena SK
0 comment
85

కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా తెలివైంది. ఆ అడవిలో నక్కలగుంపు ఉండేవి. చలికాలం వచ్చింది చలి తీవ్రత బాగా పెరిగింది. చలికి తట్టుకోలేక నక్కలు మంట వేసుకోవాలనుకున్నాయి. కొన్ని మిణుగురులను చూసి నిప్ప అనుకుని చలికాచుకోసాగాయి. వాటి తెలివి తక్కువ తనాన్ని చూసి జింక నవ్వుకుంది. మిత్రులారా అది నిప్పు కాదు మిణుగురులు. వాటి వల్ల మీకు చలి తీరదు. అని సలహా ఇచ్చింది. ಆమాటలు విన్న నక్కల గుంపునకు కోపం ఇచ్చింది. మాకే సలహాలు ఇచ్చేంత గొప్ప దానివా  జింకను చుట్టుముట్టి దాడి చేసి చంపేశాయి.

నీతి: మూర్ఖులకు హితము చెప్పరాదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version