ఒక అడవిలో ఒక జిత్తులమారిన తోడేలు ఉండేది. అది ఒక రోజు పులి వేటాడి వదిలేసిన జంతువులను తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది. ఎంతో కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో బాగా ఆలోచించి.అక్కడ కొంగ ఉంటే కొంగ వద్దకు వెళ్ళింది. కొంగ మామ నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది. దాని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని అన్నీಆశ చూపింది. కొంగ సరే ಅನಿ దాని నోటిలో అతన ముక్కు పెట్టి ఎముకను బయటకు తీస్తుంది. ఎముక బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడ నుంచి కొంగ ఎగిరి ఎదురెళ్లి అదేంటి మామ ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది. నువ్వ నా నోట్లో తల పెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు ఇచ్చిన బహుమతి అని చెప్పింది తోడేలు.
నీతి: చెడ్డవాళ్లకు సాయం చేసినా వాళ్ళకు కృతజ్ఞత ఉండదు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.