ఒక గ్రామంలో రాము అనే రైతు నివసిస్తున్నాడు. అతను తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఒక రోజు రాము పోలం కోసం విత్తనాలు కొనడానికి నగరానికి వెళ్ళాడు. అతను షాపులో విత్తనాలు తీసుకుంటుండగా, అతని దృష్టి అక్కడ ఉన్నా రెండు కుండలవైపు మళ్లింది. రెండు కుండల చూడటానికి చాల బాగున్నాయి. వీటిని నేను తీసుకుంటే, నది నుంచి ఎక్కువ నీరు తీసుకోరాగాగుతాను. అని రాము అనుకున్నాడు.
ఇది ఆలోచించి, అతను రెండు కుండలను కొనుక్కున్నాడు. మరుసటి రోజు రాము రెండు కుండలను ఒక కట్టెకు ఇరువైపులా తాడుతో కట్టి, నీళ్లు తీసుకొనిరావడనికి నదికి వెళ్ళాడు. రాము రెండు కుండలలో నీళ్లు నింపి తన ఇంటికి తెచ్చాడు. ఇంటికి తెచ్చాక, అతను ఒక కుండలో నీళ్లు నిండుగా ఉన్నాయి, మరొక కుండలో సగం నీళ్లు ఉన్నాయి. ఇది చూసిన రాముకు ఒక కుండ పగిలిందని తీసుకున్నాడు.
రెండు కుండలలో ఉన్న నీళ్ళని తన ఇంటి దగ్గర ఉన్న పెద్దకుండలో పోశాడు. మళ్ళీ మరుసటి రోజు రాము రెండు కుండలతో నీళ్లు తీసుకొచ్చి పెద్దకుండలో పోశాడు. రాము తన పొలం పనికి వెళ్లిన తరువాత, పగిలిన కుండ, “ నా వాళ్ళ ఎటువంటి ప్రయోగానం లేదు”, అని బాగున్నా కుండతో చెబుతుంది. నేను నీళ్లు తెచ్చే ప్రతిసారి సగం నీటిని దారిలో పడేస్తాను, అయిననప్పటికీ మన యజమాని నన్ను ప్రతిరోజూ నదికి తీసుకొనివెళ్లుతారు.” ఇది విన బాగున్నా కుండ, “ అవును సరిగ్గా చెప్పావు, నీ వలన ఎటువంటి ప్రయోగానం లేదు.”
అని చెప్పి పగిలిన కుండ వైపు చూస్తూ నవ్వుతుంది. మరుసటి రోజు, రాము నదికి వెళ్లి నీళ్లు తేవడానికి కుండలను తీసుకుంటుంటే, పగిలిన కుండ రాముతో,” నా వల్ల ఎటువంటి ప్రయోగానం లేదు” అంటుంది. అయినప్పటికీ మీరు నన్ను అలాగే తీసుకెళ్తున్నారు. నేను మీ కష్టాన్ని పాడు చేస్తున్నాను, కాబట్టి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళండి.” ఈ మాటలు విన్న రాము కుండతో మాట్లాడుతూ “ నిన్ను నీవు పనికీరానిదానిగా భావించవద్దు.
నాతో పదండి, మనం దారిలో వస్తున్నప్పుడు, మార్గములో ఉన్న పువ్వులును చూడు, అవి నీ మనస్సును మంచిగా కుండ తన యజమాని చెప్పిన మాటలను విని సరే అంది, రాము రెండు కుండలను తీసుకొని నది నుండి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. వచినప్పుడు, దారిలో ఉన్న పువ్వులును చూసి, అది చాల సంతోషించింది. కానీ అతను ఇంటికి చేరుకోగానే, కుండలో సగం నీళ్లును చేసికొని, కుండ మళ్ళీ బాధపడుతుంది.
పగిలిన కుండతో రాము నీవు పనికిరానిదానివి కాదు, నీవు కూడా చాలా మేలు చేస్తున్నావు. నీవు పగిలిపోయావని నాకు తెలియగానే, నేను పువ్వుల విత్తనాలను తెచ్చి దారిలో నాటాను. దారిలో నీవు చూసిన పువ్వులన్నీ నీ నీళ్లు నుండి పెరిగిన పువ్వులు.” అని చెప్పాడు. వాటితో నేను, నీ వల్ల లాభం పొందుతున్నాను. ఎందుకంటే, నేను ఈ పువ్వులను తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముతున్నాను. అవి మంచి ధరకు అమ్ముతున్నాను నాకు మంచి లాభం వస్తుంది. ఇది విన్న పగిలిన కుండ తాను పనికిరానిదానిని కాదు అని తెలుసుకొని. నా వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అని సంతోషంగా ఉంటుంది.
కథ యొక్క నీతి:
“పగిలిన కుండ” కథ యొక్క ముఖ్య నీతి అనేది, ప్రతి వ్యక్తికి తనలోని దోషాలను మరియు పగలు ఉన్నప్పటికీ, వారు ఎలా విలువైనదిగా ఉండవచ్చో తెలియజేయడం. ఈ కథలో, పగిలిన కుండ తన పగలు ఉన్నప్పటికీ, మార్గంలో ఉన్న అందమైన పువ్వులను నీటితో తడిపి పెంచుతుంది, ఇది మనం కూడా మన దోషాలను ఉపయోగించి ఇతరులకు సహాయం చేయవచ్చు అని సూచిస్తుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.