79

ఒకానొక ఊరిలో ఒక చిన్న రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు పేరు సాంబయ్య. సాంబయ్య తన భార్య ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండే వాడు. భార్య పేరు శాంతి, పెద్ద కొడుకు పేరు సునీల్ మరియు చిన్న కొడుకు పేరు ప్రణయ్. ప్రతిరోజు ఉదయాన్నే లేచి సాంబయ్య పొలం పనికి వెళ్ళేవాడు. తన భార్య ఇంట్లో పని అంత ముగించుకుని అడవిలోకి కట్లు కొట్టడానికి వెళ్ళేది. ఆ ఊరిలో వీరు ధనవంతులు కాకపోయినప్పటికీ మంచితనం తోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అలా వారి జీవితం సంతోషం గా గడచిపోయేది.

ఒకరోజు ఎప్పటి లానే సాంబయ్య పొలం పనికి వెళ్ళాడు. శాంతి కట్లు కొట్టడానికి అడవికి వెళ్ళింది. కట్లు కొట్టుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఒక నాగుపాము శాంతిని కాటు వేసింది. శాంతి అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది. ఊరిలో ఉండే వారి ద్వారా సాంబయ్య ఈ వార్తను తెలుసుకున్నాడు. వెంటనే తన వద్దకు వెళ్ళాడు, కానీ ప్రాణం లేకుండా పడి ఉన్న తన భార్యను చూసి కన్నీటి సంద్రంలో మునిగాడు. పిల్లలు కూడా అమ్మా అమ్మా అంటూ బోరున విలపించారు.

భార్య లేదన్న భాదను సాంబయ్య తట్టుకోలేక సాంబయ్య రోజు రోజుకి క్రుంగి కుసించి నశించి పొయ్యేవాడు. తన తండ్రి పరిస్థితి చూసి పిల్లలు ఇద్దరు చిన్న వయసు నుండే పనికి వెళ్తూ ఇంట్లో తిండి తిప్పలు తన తండ్రి బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు సాంబయ్యకి తీవ్రమైన ఆయాసం వచ్చింది. ఇదే తన చివరి అని సాంబయ్య గ్రహించి తన ఇద్దరి కొడుకులను పిలిచి.. నాయనా నేను మీ అమ్మ వద్దకు వెళుతున్నాను.

మీరు ఇద్దరు రామలక్ష్మణుల్లా కలసి ఉండాలనేదే నా కోరిక. మీకు నేను ఆస్తి అంటూ ఏమి సంపాదించి పెట్టలేదు ఈ ఇల్లు తప్ప! అని చెప్పి ఆయన వంటి పై ఉన్న తుండు గుడ్డ మరియు తాను ఎంత గానో ప్రేమగా పెంచుకున్న మామిడి చెట్టు మీకు ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి నాన్న కన్నుమూశారు.పిల్లలు ఇద్దరిలో సునీల్ కొంచెం మోసగాడు మరియు ప్రణయ్ అమాయకుడు.

తన తండ్రి ఇచ్చిన తుండు గుడ్డను పగలు అంత నువ్వు ఉపయోగించుకో,రాత్రి సమయంలో నేను ఉపయోగించుకుంటాను అని చెప్పాడు, అలాగే మామిడి చెట్టు కింది భాగం నువ్వు తీసుకో పై భాగం నేను తీస్కుంటాను అని చెప్పాడు సునీల్, అమాయకుడైన ప్రణయ్ అందుకు సరే అన్నాడు.చెట్టు కింది భాగం ప్రణయ్ కావడంతో తాను మామిడి చెట్టుకు రోజు నీరు పోసేవాడు. కానీ చెట్టు పై భాగం సునీల్ ది కావడంతో చెట్టుకు కాసిన కాయలు అన్ని తనే తీస్కునేవాడు. తుండు గుడ్డను పగలు తమ్ముడు ఉతికి ఆర పెడితే రాత్రి సునీల్ చలికి కప్పుకుని వాడు. ఇలాగ ప్రతి రోజు సాగుతూ ఉండేది.

కొంత కాలం అయ్యాక అన్నతమ్ములు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకున్నారు.సునీల్ భార్య పేరు రమ్య, ప్రణయ్ భార్య పేరు స్వప్న. రమ్య కంటే స్వప్న చాలా చురుకైనది, తెలివైనది. ఇంటికి వచ్చిన మూడు రోజుల్లోనే తన బావ వాళ్ళని మోసం చేస్తున్నాడు అని గ్రహించి, తన భర్త ప్రణయ్ కు వాళ్ళ అన్న సునీల్ మోసం అంత చెప్పింది. దానికి పరిష్కారం కూడా స్వప్న నే చెప్పింది. ఆ తర్వాత రోజు ప్రణయ్ పగలంతా తుండు గుడ్డను వాడుకుని సాయంత్రం దాన్ని ఉతికి పెట్టె వాడు. కాబట్టి తన అన్న దాన్ని వినియోగించుకోలేక చలికి వణుకుతూ పడుకునే వాడు.

ఒకరోజు మామిడి చెట్టు మొదట్లో నీరు పొయ్యకుండా గొడ్డలి తో మొదలును నరక బోతుండగా తన అన్న ప్రణయ్ ను ఆపి ఎం చేస్తున్నావ్ తమ్ముడు అని అడగగా…. ఏ చెట్టు వాళ్ళ నాకు ఆ ఉపయోగం లేదు అన్నయ్య ఇది నాకు ఒక్క పండు కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇది నాకు పనికి రాదూ అని నరకబోయాడు.అప్పుడు తను చేసిన కుట్ర ప్రణయ్ కు తెలిసిపోయించి అని సునీల్ గ్రహించి.. తమ్ముడు నేను నిన్ను అమాయకుడిని చేసి ఇన్నాళ్లు ఈ చెట్టుకు కాసిన కాయలు అన్ని నేనే తీస్కున్నాను.

ఇక ఇప్పటి నుండి ఆలా చెయ్యను. దీనికి పండిన పండ్లను ఇద్దరం సమానంగా పంచుకుందాం. తుండు గుడ్డను కూడా నెలలో సగం రోజులు నీకు సగం రోజులు నాకు అని చెప్పాడు, అందుకు వాళ్ళ భార్యలు కూడా అంగీకరించారు. అప్పటి నుండి వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోయేది.

నీతి: మనం ఎదుటి వారిని మోసం చెయ్యాలని చూస్తే అది మనకే ముప్పు తెచ్చి పెడుతుంది.

మరిన్ని తెలుగు కథల కొరకు తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.

You may also like

Leave a Comment

Exit mobile version