ఒకరోజున ఒక కుక్క బజార్లో పోతుంటే దానికి ఒక మాంసం ముక్కు దోరికింది. దానికి చాలా ఆకలిగా ఉంది. కాని అక్కడే తినడం దానికి నచ్చలేదు హాయిగా కాలువ ఆవలి ఒడ్డుకుపోయి ఎవరూ లేనిచోట తింటాను అనుకొంది. కాలువ మీద నున్న చిన్న వంతెన దాటి ఆవలివైపుకు పోతూ పోతూ నీళ్ళలోకి చూసింది. అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్కు కన్పించాయి. అది తన నీడ అని దానికి తెలియదు.
అబ్బ ಆ మాంసం ముక్కు ఎంత బాగుందో ఆ ముక్కు కూడా నాకు వస్తే నాకు రెండు ముక్కులుంటాయి. హాయిగా తినవచ్చు నేను గట్టిగా మొరిగితే ఆ కుక్కహడలి పోయి ಆ మాంసాన్ని వదిలేని పారిపోతుంది. అనుకొని భౌ ಭೌ అని అరిచింది. ఇది మొరిగితే ఆ కుక్క నోరు పెదపలేదు జవాబుగా ఏమీ మొరగలేదు. కానీ ఒక చప్పుడు మాత్రం విన్పించింది అది కుక్క నోట్లాని మాంసం ముక్కు నీళ్ళలో పడిన చప్పుదు.
నీతి: లేని దానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.