Home » బెంగళూరు లో మీరు మిస్ అవుతున్న 10 ప్రదేశాలు 

బెంగళూరు లో మీరు మిస్ అవుతున్న 10 ప్రదేశాలు 

by Lakshmi Guradasi
0 comment
80

మీరు బెంగుళూరు వెళ్లడానికి టూర్ ప్లాన్ చేస్తున్నారా? లేదంటే బెంగుళూరు లో ఉన్న పరిసరా ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. చాలా మంది బెంగుళూరు కి వెళ్లి కొన్ని ప్లేస్ లను చూసి ముఖ్యమైనవి వదిలేస్తూ ఉంటారు. బెంగుళూరు లో మీకు తెలియని చోటు లు కూడా ఉన్నాయి. అవి ఏమిటో చూడండి. 

ఆదియోగి ఆలయం (Adiyogi temple (Isha Foundation))

places to visit Bangalore

బెంగుళూరు నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబల్లాపూర్‌లోని ఆదియోగి దేవాలయం ధ్యానానికి ప్రసిద్ధి. ఇక్కడ 112 అడుగుల ఎత్తైన ఆదియోగి శివుడి విగ్రహం ఉంది. దేవాలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మరియు పర్వత ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. సందర్శకులు తమ పర్యటనను ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. బెంగుళూరు నుండి చిక్కబల్లాపూర్ చేరుకోవడం సౌకర్యంగా ఉంటుంది, ప్రయాణం సుమారు 1.5 గంటలు పడుతుంది. ప్రశాంతమైన వాతావరణం కోసం, ఉదయాన్నే లేదా సాయంత్రం సందర్శించండి.

నంది కొండలు (Nandi Hills) 

places to visit Bangalore

నంది హిల్స్ వీకెండ్ లో విహారానికి అనువైనది. పర్యాటకులు ఎక్కువుగా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి సూర్యోదయాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఈ కొండలు అమృత సరోవర్ సరస్సుతో సహా అనేక ఆకర్షణలకు నిలయంగా ఉంది. ఈ ప్లేస్ ను కుటుంబాలు పిక్నిక్‌లు చేయడానికి మరియు పిల్లలు ఆట స్థలాలను ఎంచుకుని ఆనందించడానికి సరైన చోటు. అంతేకాకుండా  సాహస ప్రియులు పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్, సైక్లింగ్ మరియు గుర్రపు స్వారీలో మునిగిపోతారు. అన్ని మరిచిపోయి ప్రశాంత వాతావరణం కోరుకునే వారికీ ఇది మంచి స్థలం.  

బన్నేరుఘట్టలో బటర్‌ఫ్లై పార్క్ (Butterfly park in Bannerghatta)

places to visit Bangalore

బన్నెరఘట్టలో ఉన్న బటర్‌ఫ్లై పార్క్ ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణ.  ఈ పార్క్‌లో వివిధ రకాల అందమైన సీతాకోకచిలుకలను చూడవచ్చు. అక్కడున్న పర్యావరణం సీతాకోకచిలుకలకు అనుకూలంగా ఉండటంతో, వాటి జీవనశైలిని దగ్గరగా చూసేందుకు ఇది మంచి అవకాశం. ఈ పార్క్ అంతరించిపోతున్న సీతాకోక రకాలుతో పాటు 48 రకాల సీతాకోకచిలుకలకు నిలయంగా ఉంది. సందర్శకులు పార్క్ యొక్క అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటల గుండా షికారు చేస్తున్నప్పుడు, సీతాకోకచిలుకల జీవిత చక్రాలు మరియు వాటి ఆవాసాలను చూడవచ్చు. 

శివోహం దేవాలయం (Shivoham temple)

places to visit Bangalore

ఈ ఆలయంలో  65 అడుగుల భారీ శివుని  విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయం వద్ద రుద్రాభిషేకం, ధ్యానం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు శివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడకు వచ్చి, శివుడి అనుగ్రహం పొందుతారు. 

పిరమిడ్ వ్యాలీ (Pyramid valley )

places to visit Bangalore

ఈ వ్యాలీలోని ప్రధాన ఆకర్షణ భారీ పిరమిడ్ ఆకారంలోని ధ్యాన మందిరం. ఈ పిరమిడ్ మందిరం 101 అడుగుల పొడవుతో ఉండడం వలన, ఈజిప్ట్ యొక్క గ్రేట్ పిరమిడ్‌ను తలపిస్తుంది. పిరమిడ్ లోపలి భాగంలో 5,000 మంది వరకు కూర్చునే ప్రశాంతమైన ధ్యాన మందిరం ఉంది. పిరమిడ్ వ్యాలీ ప్రశాంత వాతావరణంలో ఉంటుంది కాబ్బటి ధ్యానకారులు శాంతిని పొందటానికి ఇక్కడకు వస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ స్థలం ధ్యానం చేయడానికి, విశ్రాంతిని పొందడానికి అత్యంత అనుకూలమైనది. మైత్రేయ బుద్ధ విగ్రహం కూడా ఇక్కడ ఆకర్షణల్లో ఒకటి. 

వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్ (Wonderla Amusement Park) 

places to visit Bangalore

చిట్టిలపిల్లి లోని వండర్లా వినోద ఉద్యానవనం కుటుంబాలతో మరియు స్నేహితులతో సరదాగా గడిపేందుకు ప్రసిద్ధమైన ప్రదేశం. ఈ వినోద ఉద్యానవనంలో జలక్రీడలు, ఎగ్జైట్ చేసే రైడ్లు, థ్రిల్ అట్రాక్షన్లు వంటి అనేక రకాల వినోదాలు ఉన్నాయి, వీటిని అన్ని వయస్సుల వారు ఆస్వాదించవచ్చు. వాటర్ పార్క్‌లోని భారీ జల రైడ్లు, రోలర్ కోస్టర్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. వీటితో పాటు, పార్క్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ షోలు మరియు గేమ్ జోన్లు సందర్శకులకు మరింత మజాను అందిస్తాయి. వండర్లా పార్క్, బెంగళూరులో అత్యంత ప్రాచుర్యం పొందిన వినోద కేంద్రాలలో ఒకటిగా నిలిచింది.

ఓంకారేశ్వర దేవాలయం ఓంకార్ హిల్స్ (omkareshwar temple omkar hills)

places to visit Bangalore

ఓంకారేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగం దేవాలయంన్నీ పోలివుంటుంది. ఈ ఆలయం ఓంకార్ హిల్స్ లో ఉంది. శ్రీనివాసపురలోని ఓంకార్ హిల్స్ బెంగళూరులోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ భక్తులు ప్రశాంత వాతావరణంలో పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో ఉన్న భారీ శివ లింగం మరియు గంట సైతం భక్తులను ఆకర్షించే ప్రత్యేక ఆకర్షణలు. సుందరమైన పరిసరాల మధ్య ఉన్న ఈ పురాతన శివాలయం 1,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా నమ్ముతారు.

మందగిరి హిల్స్ తుంకూరు (Mandagiri Hills in Tumkur) 

places to visit Bangalore

మందగిరి హిల్స్  జైనులకు పవిత్రమైన స్థలం, అలాగే ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరమైన గమ్యం.  కొండపై ఉన్న ప్రముఖ బెట్టదేవరు గుడి మరియు జైన బసదీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. దాదాపు 1000 మెట్లు కొండపై ఉన్న ఆలయానికి దారి తీస్తాయి. కొండ దిగువన నెమలి ఈకల గుత్తిని పోలిన జైన దేవాలయం ఉంది. గుడి లోపల నీటి బిందువుల శబ్దం వినబడేంత నిశ్శబ్దం ఉంటుంది. ప్రత్యేకంగా, 81 అడుగుల ఎత్తయిన గొమటేశ్వర విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. మందగిరి హిల్స్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి, దీని వలన ఇది సాహస ప్రయాణికులకు మరియు పర్యాటకులకు ఒక చక్కని స్థలంగా నిలుస్తుంది. 

శ్రీ సుస్వానీ మాతా ధామ్ పింక్ మార్బుల్ జైన్ టెంపుల్,(Shree Suswani Mata Dham Temple)

places to visit Bangalore

హోసూరు రోడ్డుపై ఉన్న శ్రీ సుస్వని మాతా ధామ్, అందమైన గులాబీ రంగు శిలతో నిర్మించబడిన జైన దేవాలయం. సుస్వానీ మాత విగ్రహంతో కూడిన ప్రధాన ఆలయం ఇది. గులాబీ శిలా శిల్పకళతో ఆలయం నిర్మించబడటం, దీని అందాన్ని మరింత పెంచి, భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆలయంలోని వివిధ శిల్పాలు మరియు నైపుణ్యంతో తీర్చిదిద్దిన నిర్మాణం జైన సంప్రదాయ కళానైపుణ్యానికి ప్రతీక. ఇది అమ్మవారి ఆలయం అయినప్పటికీ బయట కారిడార్ లో పెద్ద శివుని విగ్రహం కూడా ఉంది. 

శ్రీ రేవణ సిద్దేశ్వర బెట్ట (Sri Revana Siddeshwara Betta)

places to visit Bangalore

శ్రీ రేవణ సిద్దేశ్వర బేట్టా బెంగళూరుకు సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రమణీయ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ఈ ప్రదేశం ప్రధానంగా శివుడి ఆలయంగా పేరు పొందింది. భక్తులు కొండ ఎక్కుతూ, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు వస్తారు. ట్రెక్కింగ్ మరియు సాహస క్రీడలకు ఇష్టపడే పర్యాటకులు కూడా ఇక్కడికి తరచుగా వస్తారు. కొండ శిఖరంపైకి చేరుకున్నప్పుడు ఆ ప్రాంతం నుండి కనపడే ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి, శివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కొండ ఎక్కడానికి సౌకర్యవంతమైన బూట్లు ధరించండి, నీరు మరియు స్నాక్స్ తీసుకెళ్లండి. 

పిల్లలు నుంచి పెద్దలవరకు కుటుంబాలతో టూర్ కి లేదా పిక్నిక్ కి బెంగళూరు కు ప్లాన్ చేసుకోవచ్చు , అలాగే బెంగళూరు కు వీకెండ్ టూర్స్ కి మీకు తగిన సమయాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కుదిరితే బెంగళూరు కు 1 డే ట్రిప్ కూడా చేయవచ్చు. పిల్లలు ఆనందించడానికి ప్రత్యక ప్రదేశాలు కూడా ఉన్నాయి. 

మరిన్ని ఇటువంటి విహారి లా కోసం తెలుగు రీడర్స్ విహారి ను ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version