అనగనగా ఒక ఊళ్ళో ఒక పిల్లీ తన ఆరు బుజ్జి పిల్లి పిల్లలతో ఉంటూ వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేమం చేస్తుండేది. ఒక రోజు తన పిల్లీ పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆబావిని చూపించి మీరెవ్వరు ఈ బావి దగ్గరకి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది. పిల్లీ పిల్లలు ఒక రోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జిపిల్లీ అమ్మ ఎందుకు లా చెప్పిందేమిటో చూడాలి అనుకుంటూ అబావిలోకి తొంగి చూసింది బావి చూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక పిల్లీ పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలు పెట్టింది.లోపల కక్కు ప్రతిబింబం దీని లాగే అరవటం చూసి దానితో పొట్లాడానికి బావిలోకి ఒక్క దూకు దూకింది ఇంకేముంది పిల్లీ నిళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలు పెట్టింది ఒకరైతు చూసి అయ్యో పిల్ల నీళ్ళల్లో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తిసి రక్షించాడు.
నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నించే వచ్చే కాని ఎప్పుడు ధిక్కురించ గూడదు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.