Home » ఒక పిసినారి – నీతి కథ

ఒక పిసినారి – నీతి కథ

by Shalini D
0 comments

అనగనగా ఒక ఊరిలో ఒక పిసినారి ముసలి తాత పేరు గోపాలుడు, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉన్నాడు. అతని ఇంటికి వెనుక చిన్నతోట ఉంటుంది. తన దగ్గర ఉన్న బంగారు నాణాలని ఆ తొటిలో రాళ్ళకింద గుంత లో దాచి, దాని పైన రాళ్లు పెట్టేవాడు. కానీ ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యం గా ఆ బంగారు నాణాలని లెక్కబెట్టుకుని మళ్ళి అక్కడే పెట్టి దాచేవాడు.

ఒకరోజు ఈ పిసినారి రోజువారీ పనులన్ని గా గమనిస్తూన్న ఒక దొంగ, రోజు లాగానే, బంగారు నాణాలని లెక్కబెట్టు లోపల దాచేవరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉంది, అతను లోపలికి వెళ్ళాక ఆ దొంగ వచ్చి నాణాలని దొంగిలించాడు. మర్నాడు ముసలి తాత చూసుకుని గెట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంటిపక్క వాళ్ళు వొచ్చి, ఏమి జరిగిందాని అడిగి, తెలుసుకున్నారు. ఎవరైన ఇంటిలో సొమ్ము దాచుకుంటారు.

నువ్వేమిటి బైట, అది కూడా భూమి లో పెట్టుకున్నావు? దానితో కొనుక్కోవాలన్నా వీలు కాదు? అన్నారు. దానికి ఆ పిసినారి కొనుక్కోడామా? నేను అస్సలు ఆ బంగారం వాడనే వాడను. అది దాచుకోడానికి మాత్రమే, అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ కుంటలోకి విసిరి, అలా అయితే, అదే నీ సమ్మునుకో, నవ్వు వాడనప్పుడు దానికి విలువేది? రాయైనా, బంగారమైనా ఒకటేగా నవ్వు వాడనప్పుడు రెండు విలువ లెనీవే, అంటూ వెళ్ళిపోయాడు.

నీతి: ఈ కథ ద్వారా, డబ్బు మాత్రమే కాదు, దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవడం అవసరం అని తెలియజేస్తుంది. కష్టాలు, లేదా సంపద, ఇవి మన ఆనందానికి కారణం కావు; మన మనసులో ఉన్న సంతోషం మరియు ఆనందం ముఖ్యమైనవి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment