ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒక రోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడకు వచ్చిందో నక్క దాన్ని చూసి నీటిలోకి వెళ్లిపోవాలనుకుంది. తాబేలు కానీ అంతలో నక్క దాన్ని చుడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్లూ తలా లోపలకి లాక్కుని కథలు కుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరకు వచ్చి పట్టుకుని చేసింది. పైన డొప్ప గట్టిగా తగ్గింది. తాబేలను తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షస్తున్నంత సేపూ తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టి కూర్చింది. ఇంతలో దానికో ఉపాయం తట్టింది. దాంతో థైర్యం చేసి తలకొంచెం బయటకు పెట్టి అయ్యో నక్క బావా నువ్వెన్ని తిప్పులు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు అంది ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అమోమయంగా చూసింది తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నక్కు బావా నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్లీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మొత్తబడాను అందుకే నువ్వ నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు ఆ తర్వాత కడుపారా తినోచ్చు అని చెప్పింది. అసలే జిత్తులమారి నక్క మహా తెలివైంది కదా అందుకే తాబేలు మాటలు నమ్మి నమ్మనట్టుగానే తల ఊపింది. తాబేలును తెలివిగా నక్క బావా నేను పూర్తిగా నానాను. కానీ నువ్వ కాలుపెట్టిన చోట నానలేదు అంది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చుటుక్కున నీటిలోకి జారుకుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.