Home » జిత్తులమారి తెಲಿవి  నీతి కథ

జిత్తులమారి తెಲಿవి  నీతి కథ

by Haseena SK
0 comment
52

చీమలు దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తులమారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడడం చేతకాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు ఒక్కచిక్కిపోయి. నడవలేని స్థితికి వచ్చింది. ఒక రోజుಆ మార్గంలో వెళ్తున్న పిల్లికి ఒక్క చిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా ఇలా చిక్కి పోయావని అడిగింది. తన కష్టాన్ని చెప్పకుంది. నక్క  ఈ దగ్గరలో ఒక వింధు ఉంది. నేను వెళ్తున్నాను నువ్వ వస్తే ఎవరి కంట పడకుండా కడుపు నిండా తిని వద్దాం అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని వద్దాం అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపునిండా తిని పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊళ పెట్టింది. ఇంతలో ఇంటి వాళ్లు వచ్చి పిల్లిని నక్కని బందించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్ల ప్రాణాಲతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది. 

నీతి: మంచి వారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version