లక్ష్మిపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక, ఉడుత నివాసం ఉండేది. ఒక రోజు ఉడుత మామిడి కాయాలు తింటూ ఉండగా. చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడనుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లీ లేదు బహుశా ఆహారం కోసం వెళ్లిన వాటితల్లీ కోసం ఎదురుచూస్తున్నాయి అనుకుంది.ఎంత సేపటికి పిల్లల అరుపులు ఆగక పోవడంతో మరోసారి వెళ్లి చూసింది. అయినప్పటికీ తల్లి రాలేదుఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచ్చుక కు చెప్పింది. అప్పుడు పిచ్చుక లో ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు ఒక వేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి భాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించే పెద్ద చేస్తాను అని చెప్పింది. ఉడుత అప్పుడు పిచ్చుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉండే మో వెళ్లి చూడు అని సలహా ఇచ్చింది. ఉడుత వేతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గురి తప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి సపర్య చేసి పిల్లల వద్దకు చేర్చింది. తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడుతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది.
నీతి :మనం ఏదైనాపని చేసే ముందు మంచి వారి సలహా తీసుకొవడం మంచిది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.