మన తెలుగు సంప్రదాయాలలో తొలి ఏకాదశి ఎంతో విశిష్ట కలిగిన రోజు. ఈ రోజు భక్తులు అందరు ఉపవాస దీక్ష ను ఆచరిస్తారు. మనకి సాధారణంగా ప్రతి నెలలో 15 రోజులకి రెండు ఏకాదశి లు వస్తుంటాయి. అలాగే ఆషాడ మాసం లో శుక్ల పక్షము నాడు వచ్చేదే ఈ తొలి ఏకాదశి.
మన ఇతిహాసాలలో ఒకటి అయినా పద్మ పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువు క్షీర సాగరం లో ఈ రోజు నుంచి 4 నెలల వరకు యోగ నిద్రలోకి వెళ్తారు అని చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు.
అయితే ఈ సంవత్సరం తొలి ఏకాదశి 16 జులై రాత్రి 8:33 నిమిషాల నుండి 17 వ తేదీ రాత్రి 9:02 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయం లో భక్తులు దేవుడికి శ్రద్ధతో పూజలు, నైవేద్యాలను అందిస్తుంటారు.
అయితే మన సంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు ఎక్కువగా జొన్నలతో చేసిన లడ్డు లను నైవేద్యంగా పెడతాము. మరి ఇప్పుడు ఈ జొన్న లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో చూసేధ్దం రండి.
కావలసినవి:
జొన్నలు 1kg
బెల్లం – 1/4 kg
యాలకులు – 4
నెయ్యి – రుచి కి సరిపడే అంత
తయారు చేసే విధానం:
ముందు గా జొన్నలు తీసుకొని వాటిలో ఏమైనా చిన్న నల్కలు ఆలా ఉంటె సుబ్రాంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బండాలి పెట్టి కొద్దీగా వేడి అయ్యాక దాంట్లో ఒక కప్పు జొన్నలు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఆలా జొన్నలు కొంచెం వేడి అయ్యాక అవి చిటపట అంటూ తెల్లగా పాప్కార్న్ ల మారుతుంటాయి. ఈ సమయం లో మూత పెట్టి ఆ జొన్నలు అన్ని పాప్కార్న్ ల అయ్యేవరకు ఉంచి మల్లి తీసి పక్కన పెట్టేసుకోవాలి.
ఈ విధంగా మిగిలిన జొన్నలన్నింటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా పాప్కార్న్ ల వేయించుకున్న జొన్నలను బాగా చల్లారాక మిక్సీ లో వేసి పొడి లాగా చేసుకోవాలి.
ఇక తర్వాత బెల్లం ను పాకం పట్టాలి. 1/4 kg బెల్లం కి 1 ½ గ్లాసు నీళ్లు సరిపోతాయి. బెల్లం అంత నీళ్లల్లో కరిగిపోయే అంత వరకు పాకం పడితే సరిపోతుంది.
ఇప్పుడు ముందుగా చేసుకున్న జొన్న పిండి లోకి ఈ బెల్లం పాకం నీ వేస్తూ ముద్దలు తయారు చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఇక దాంట్లో మీ రుచికి సరిపడిపోయేంత నేయ్యి ని వేసి బాగా కలపండి. ఇక చివరగా ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి దేవుడికి నైవేధ్యంగా పెట్టేయండి.
మారినా వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి, సందర్శించండి.