Home » Idagunji Ganesha – వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు….. 

Idagunji Ganesha – వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు….. 

by Lakshmi Guradasi
0 comment
104

కర్ణాటక రాష్ట్రం, ఇడగుంజి లో వినాయకుడి ఆలయం వుంది. ఈ ఆలయం శార్వతి నది ఒడ్డున వుంది. ఇక్కడ స్వయంబుగా వెలసిన వినాయకుడిని విబుజ గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలో వినాయకుడి వాహనమైన ఎలుక కనిపించదు.ఇక్కడ వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించింది, విగ్రహ ప్రతిష్ట చేసింది విశ్వ కర్మ అని భక్తులు నమ్ముతారు.

కలియుగం లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఋషులంతా యజ్ఞ యాగాలు చేయడానికి శార్వతి నది ప్రాంతం లోని కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. యజ్ఞ యాగాలు మొదలు పెట్టిన దెగ్గర నుంచి ఏదొక ఆటంకం వస్తూనే ఉన్నాయంటా. అందుకు ఋషులంతా కలిసి నారదుని శరణు కొరగా,నారదుడి సూచనా మేరకు వాలఖిల్య అనే ఋషి వినాయకుడి విగరహాని ప్రతిష్టించి కలియుగ అడంకులను తొలగించాలని ప్రాదించాడు. వినాయకుడి విగ్రహం ప్రతిష్టించగానే యజ్ఞం సాపిగా జరిగిపోయింది. తమ కోర్కెను నెరవేర్చినందుకు ఋషులంతా వేణువులతో రాగాలు వినిపించారు. ఋషల భక్తికి మెచ్చిన వినాయకుడు ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలు నెరవేరుస్తానని వరం ఇస్తాడు. బల్లి అనే బాలుడు కుంజవనం లో గణేశ విగ్రహాన్ని చూసి ఒక చిన్న మందిరాన్ని నిర్మించాడు, అది చివరికి ప్రస్తుత ఆలయంగా మారింది. ఆనాటి కుంజవనమే ఇనాటి ఇడగుంజి.

idagunji ganesha temple

వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదైనా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటి పెద్దలు ఈ ఆలయం వద్దకు వచ్చి వినాయకుడి పాదాల వద్ద రెండు చిటీలను ఉంచుతారు. కుడి కాళీ దెగ్గర చిట్టి పడితే శుభం అని, ఎడమ కాళీ దెగర చిట్టి కిందపడితే అశుభం అని ఆ వురి వాళ్ళు భావిస్తారు.

ఇక్కడ వినాయకుడు ఒక చేతిలో మోదకాన్ని, మరోచేతిలో కలువ మొగ్గని ధరించి, మేడలో పుల్లదండతో కనిపిస్తాడు. వినాయకుడికి గరికని నైవేద్యంగా సమర్పిస్తే చాలు తమ కోర్కెలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. స్వామికి ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు నిరవహిస్తారు.

ఇడగుంజి గణేశ దేవాలయం 8వ శతాబ్దంలో కదంబ రాజవంశలు నిర్మించారని నమ్ముతారు, విజయనగర సామ్రాజ్యం మరియు మరాఠా పాలకుల చేత నిర్మించబడింది. తరువాత పునర్నిర్మాణాలు, మార్పుచేర్పులు జరిగాయి. ఈ ఆలయంలో శిల్పాలు, అలంకరించబడిన స్తంభాలు, ఓ పెద్ద గోపురం ఉన్నాయి. అంతేకాకుండా గర్భగుడి, పెద్ద హాలు ఉన్నాయి.

idagunji ganesha temple

ఈ ఆలయంలో వినాయకుడుకి ఒకదానికి బదులు రెండు దంతాలు, నాలుగు చేతులకు బదులు రెండు చేతులు ఉంటాయి. మరియు ఒక గ్రానైట్ గంట, చుట్టూ హారము మరియు తల వెనుక భాగంలో రాతితో కప్పబడిన సున్నితమైన వెంట్రుకలాంటి స్టాండ్ ఉంటాయి. నల్లరాతి విగ్రహం రూపంలో పూజించబడతాడు గణేశుడు.ఈ ఆలయంలో శివుడు, పార్వతి దేవి మరియు సుబ్రహ్మణ్య స్వామి వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు.

ఈ ఆలయంలో గణేష్ చతుర్థి, మాఘి గణేషోత్సవం మరియు వార్షిక రథోత్సవంతో సహా వివిధ పండుగలను జరుపుతారు. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను, యాత్రికులను ఆకర్షిస్తాయి.

సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి నెలలలో వెళితే గణేష్ చతుర్థి మరియు ఇతర పండుగ రోజులు (ప్రత్యేక వేడుకలు) చూడవచ్చు. అక్కడ ఉండడానికి ఆలయ అతిథి గృహం ఉంది. అది కాకపోతే ఇడగుంజి సమీపంలో ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఆలయ వేళలు ఉదయం 6:00 AM నుండి 12:30 PM వరకు తిరిగి సాయంత్రం: 4:00 PM నుండి 8:30 PM వరకు.

ఆలయానికి చేరుకునేందుకు…..

  • విమాన మార్గం: సమీప విమానాశ్రయం గోవా విమానాశ్రయం (120 కి.మీ)
  • రైలు ద్వారా: సమీప రైల్వే స్టేషన్ హొన్నావర్ రైల్వే స్టేషన్ (15 కి.మీ)
  • రోడ్డు మార్గం: కర్ణాటకలోని ప్రధాన నగరాల నుండి బస్సు మరియు టాక్సీ సేవల ద్వారా బాగా కనెక్ట్ చేయబడింది.

ఇడగుంజి గణేశుడి ఆలయ లొకేషన్ (exact map location)

మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version