Home » శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా సాంగ్ లిరిక్స్ – Trinetram

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా సాంగ్ లిరిక్స్ – Trinetram

by Lakshmi Guradasi
0 comment
3

నరసింహా… ఆఆ.. లక్ష్మీ నరసింహా..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా..

నీవే శరణమయా
ఓ యాదగిరీ నరసింహా

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

పురాణ యుగమున ఈ గిరి పైనే
తపమొనరించెను యాద రిషి
ధరాతలమ్మున అతని పేరుతొ
అయ్యింది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలెసెను
ప్రళయ మహోజ్వల
జ్వాలా నరసింహుడు
భక్త అభీష్టములు అన్నియు తీర్చే
లక్ష్మీ నరసింహుడు

సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు
ఆఆఆ…ఆఆఆ…ఆఆఆ.
సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు

నమో నమః నమో నమః

నమస్కరించెను నాలుగు
దిక్కులు నఖముల వెలుగుకు
మ్రొక్కెను చుక్కలు
గోకుల రూపము దాల్చినదీ
ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది
మహా కాల చక్రము

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ
విష్ణు గుండమే ప్రవహించే
ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే
కర్మ విమోచనమే
ఇక విశ్వ వైద్యుడై స్వామియే
చేయును రోగ నివారణమే
చిత్తము దేహము
సత్వముగా నవు
బెత్తము తాకగనె

భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం
ఆఆఆఆ…ఆఆఆఅ…ఆఆఅ…
భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం

నమో నమః నమో నమః

క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
సాక్షి ఔను ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి
శ్రీ నరసింహుని దర్శనము
కోరిన కోర్కెలు తీర్చేటి
మహా కల్ప వృక్షము

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

భూత ప్రేత పిశాచ రాక్షసుల
ప్రారద్రోలు నీ నామమే
క్షుద్ర శక్తులను బాణామతులను
దగ్దమొనర్చు నీ స్మరణమే

ప్రపంచ బాల ప్రహ్లాదునియే
హిరణ్యకశిపుడు హింసింపగనె
సర్వ కాలముల సర్వ అవస్తల
సర్వ దిక్కులకు వ్యాపించి
సంరక్షింపుము నరసింహా
అనుగ్రహింపుము నరసింహా
యాదగిరీశా నరసింహ
ఓం..ఓం..ఓం..ఓం..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా..

______________________________________

పాట పేరు: శ్రీకర శుభకర (Sreekara Subhakara)
గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
సాహిత్యం: భువన చంద్ర (Bhuvana Chandra)
దర్శకుడు: కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)
నిర్మాత: జి.శ్రీనివాస్ రెడ్డి (G. Sreenivas Reddy)
తారాగణం : సిజ్జు ( Sijju), రాశి (Raasi), కె.ఆర్. విజయ (K.R. Vijaya), ఎల్.బి. శ్రీరామ్ (L.B. Sriram)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version